NTV Telugu Site icon

JP Nadda: ‘అరవింద్ కేజ్రీవాల్ అబద్ధాల ఎన్‌సైక్లోపీడియా’: జేపీ నడ్డా

Jp Nadda

Jp Nadda

JP Nadda: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కాయి. దీంతో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ ఒక్కసారి అవకాశమివ్వండి అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ ప్రచారంతో హోరెత్తిస్తుంది. ఇక, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ.. ‘ఫిబ్రవరి 5వ తేదీన జరగనున్న ఎన్నికల్లో విజయం మాదే అని ధీమా వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ పాలనపై ప్రజలు భ్రమపడ్డారు, ఇప్పుడుఆ భ్రమలు వీడి వాస్తవంలోకి వచ్చిన ప్రజలు బీజేపీకి పట్టం కట్టడానికి ఢిల్లీ వాసులు నిర్ణయించుకున్నారు. కేజ్రీవాల్‌ అవినీతి, పాలనా రాహిత్యంతో హస్తినా ప్రజలు విసిగిపోయారు.. ఇప్పుడు దేశ రాజధానికి డబుల్‌ ఇంజన్‌ సర్కార్ అవసరమని జేపీ నడ్డా పేర్కొన్నారు.

Read Also: Naga Babu: మీరు ఏమైనా రామరాజ్యాన్ని నడిపారా‌‌.. రావణ రాజ్యాన్ని నడిపారు!

ఇక, నా మాటలు రాసి పెట్టుకోండి ఢిల్లీ పీఠంపై బీజేపీ పార్టీ జెండా ఎగురవేస్తామని జేపీ నడ్డా అన్నారు. ఇక, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఒక అబద్ధాల ఎన్‌సైక్లోపీడియా’ అంటూ మండిపడ్డారు. అతడి అబద్ధాల ఎన్‌ సైక్లోపీడియాను ఢిల్లీ ప్రజలు అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. ఆప్‌ అవినీతి చేసేందుకు కొత్త మార్గాలను వెతుకుతుంది.. అందులో లిక్కర్ పాలసీ ఒకటి.. దాని వల్ల కేజ్రీవాల్ జైలుపాలయ్యారని ఆరోపించారు. అలాగే, ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై కూడా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి స్పందించారు. ప్రతి రాజకీయ పార్టీకి ఒక్కో ప్లాన్ ఉంటుంది.. మాకు ఒక వ్యూహం ఉంది.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థుల్ని ప్రకటించలేదు.. ఢిల్లీలో కూడా అంతేనని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు.