NTV Telugu Site icon

UK: యూకే నూతన ప్రధానిగా కీర్‌ స్టార్మర్‌.. కింగ్ ఛార్లెస్-3 ఆమోదం

K 3

K 3

లండన్‌లో లేబర్ పార్టీ చారిత్రాత్మక విజయం సాధించింది. కీర్ స్టార్మర్ ప్రధానమంత్రి అయ్యారు. అనంతరం బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కింగ్ చార్లెస్-3ని కలిశారు. కింగ్ ఛార్లెస్-3… కీర్ స్టార్మర్నియామకాన్ని ఆమోదించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించారు. భేటీకి సంబంధించిన చిత్రాన్ని రాజ కుటుంబం ఎక్స్‌ వేదికగా షేర్ చేసింది.

రాజును కలిసిన అనంతరం నూతన ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కొత్త ప్రభుత్వం సేవా ప్రభుత్వం అని.. దేశానికి మొదటి ప్రాధాన్యమని, తర్వాతే పార్టీ అని స్పష్టం చేశారు. ప్రజాసేవ ఒక గౌరవం అని వ్యాఖ్యానించారు. శుక్రవారం జరిగిన ఎన్నికల కౌంటింగ్‌లో లేబర్‌ పార్టీ నాలుగు వందలకు పైగా సీట్లు దక్కించుకోగా.. కన్జర్వేటివ్ పార్టీ 120 సీట్ల దగ్గర ఆగిపోయింది. ఇక దీనికి ముందు రిషి సునాక్‌.. ప్రధాని అధికార నివాసం ముందు చివరి ప్రసంగం చేసి, రాజును కలిసి రాజీనామా సమర్పించారు.

ఇక యూకే నూతన ప్రధానిగా ఎన్నికైన కీర్ స్టార్మర్‌ను ప్రధాని మోడీ అభినందించారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు.