NTV Telugu Site icon

Keerthy Suresh: పవన్ సినిమా ఇక్కడ ఆగింది.. అక్కడ మొదలైంది

Keerthy

Keerthy

Keerthy Suresh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క హీరోగా ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఇక పవన్ నటిస్తున్న సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. తమిళ్ లో హిట్ అందుకున్న తేరికి రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం సగం షూటింగ్ ను జరుపుకుంది. కానీ, ఈలోపే ఏపీ ఎలక్షన్స్ కు సమయం దగ్గరపడుతుండటంతో పవన్, సినిమాలకు కొద్దిగా బ్రేక్ ఇచ్చాడు. దీంతో ఉస్తాద్ కూడా మధ్యలో ఆగిపోయింది. త్వరలోనే ఈ సినిమా మళ్లీ మొదలుకానుంది. ఇక తేరి మూవీ.. ఇప్పుడు హిందీకి వెళ్ళింది. ఎప్పటి నుంచో ఈ సినిమా హిందీలో రీమేక్ అవుతుందని వార్తలు వచ్చాయి. కానీ, అధికారికంగా చెప్పింది లేదు. ఇక నేడు ఈ సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

భోగి రోజు ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టారు. ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తుండగా.. కీర్తి సురేష్ మెయిన్ హీరోయిన్ గా, వామిక గబ్బీ సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక తమిళ్ లో ఒరిజినల్ సినిమాకు దర్శకత్వం వహించిన అట్లీనే దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే జవాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అట్లీ.. ఇప్పుడు తేరి రీమేక్ తో రెండో సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ముంబైలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు హీరో, హీరోయిన్లు వరుణ్ ధావన్, కీర్తి సురేష్, వామిక గబ్బి పాల్గొన్నారు. దర్శకుడు అట్లీ, నిర్మాతలు ప్రియా అట్లీ, మురాద ఖేతన్ సైతం హాజరయ్యారు. పూజా వేడుకల అనంతరం షూటింగ్ మొదలు పెట్టారు. త్వరలో రెగ్యుల్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments