Site icon NTV Telugu

Keerthy Suresh: మోడర్న్ వైట్ లుక్‌లో కీర్తి మ్యాజిక్..

Keerthi Suresh

Keerthi Suresh

మహానటి కీర్తి సురేష్ తెలుగులో చివరిగా కనిపించి రెండేళ్లు దాటిపోయింది. ‘భోళా శంకర్’ తర్వాత పెద్దగా కనిపించని ఆమె, ఇటీవల ‘ఉప్పు కప్పురంబు’ ద్వారా ఓటీటీలో ప్రేక్షకులను కలుసుకుంది. ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలతో రీ-ఎంట్రీకి రెడీ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో కొత్త ప్రాజెక్టులు సైన్ చేస్తూ బిజీ అవుతున్న కీర్తి, తాజాగా మలయాళ స్టార్ ఆంటోనీ వర్గీస్‌తో కలిసి ఓ కొత్త సినిమాలో నటించనుంది. రిషి శివ కుమార్ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని పెపే కీర్తి ప్రాజెక్ట్ పేరుతో అనౌన్స్ చేశారు. ఇప్పటికే తమిళంలో రెండు సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ఒక వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది.

Also Read : Anil Ravipudi : టాప్ ప్రొడక్షన్ హౌస్‌తో అనిల్‌ రావిపూడి ఫిక్స్! మరో భారీ ప్రాజెక్ట్ లైన్లో

తెలుగులో రెండు కొత్త ప్రాజెక్టులు సైన్ చేసిన ఆమె, వాటిలో ఒకటి విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న సినిమా. ఇలా వరుస లైనప్‌తో, 2025 కీర్తి సురేష్ సంవత్సరంగా మారనుందని సినీ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా వైపు చూస్తే కీర్తి సురేష్ ఇటీవలి రోజుల్లో గ్లామర్‌ డోస్ పెంచి అభిమానులను ఆకట్టుకుంటోంది. హాట్ హాట్ లుక్ లో హీట్ పెంచుతోంది. తాజాగా మోడ్రన్ వైట్ అవుట్‌ఫిట్‌లో షేర్ చేసిన ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. పెద్ద చెవిపోగులు, క్యూట్ లుక్స్‌తో అదరగొట్టిన ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది.

Exit mobile version