టాలీవుడ్‌లో వరుస బ్లాక్‌బస్టర్‌లతో తనకంటూ సాలిడ్ హిట్ ట్రాక్ రికార్డు సెట్ చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో మరో సూపర్‌హిట్‌ను లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ సినిమా సెట్స్ నుంచే మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఇక అనిల్ లైనప్‌పై మరొక బిగ్ అప్డేట్ బయటకు వచ్చింది. సౌత్‌లోని టాప్ స్టార్స్ చిరంజీవి, యష్, విజయ్ ప్రాజెక్ట్‌లను చేస్తూ ప్రస్తుతం ఇండస్ట్రీ అటెన్షన్‌లో ఉన్న కెవిఎన్ ప్రొడక్షన్స్, తమ బ్యానర్‌లో అనిల్ రావిపూడితో కూడా సినిమా ఖాయం చేశామని అధికారికంగా వెల్లడించారు.
అనిల్ పుట్టినరోజు సందర్భంగా కెవిఎన్ ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా విష్ చేస్తూ.. “మా విజనరీ డైరెక్టర్‌తో మరో భారీ సినిమా రాబోతోంది” అని హింట్ ఇచ్చింది. దీంతో ఈ బ్యానర్‌లో అనిల్ సినిమా పక్కాగా కన్ఫర్మ్ అయినట్టే. అయితే మరి ఈ కొత్త ప్రాజెక్ట్‌లో ఏ స్టార్ హీరో నటించబోతున్నారు? మిగతా నటీనటులు ఎవరు? అన్న విషయం మాత్రం ఇంకా రివీల్ కాలేదు. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇదే కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్‌లో మరో భారీ చిత్రం ఇప్పటికే లైన్‌లో ఉంది. ఇప్పుడు అనిల్ రావిపూడి జాయిన్ కావడంతో ఈ బ్యానర్ సౌత్ సినీ ఇండస్ట్రీలో మరింత ఫోకస్ అవుతోంది.