NTV Telugu Site icon

Keerthy Suresh: కీర్తి పెళ్ళెప్పుడు అంటే.. ఆ రేంజ్ లో సమాధానమిచ్చిందేంటి

Keerthy

Keerthy

Keerthy Suresh: నేను శైలజ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది కీర్తి సురేష్. ఇక మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకున్న కీర్తి.. మహానటి సినిమాతో జాతీయ అవార్డును అందుకోవడమే కాకుండా ప్రేక్షకుల మనసులో చిరకాలం సావిత్రిలానే నిలిచిపోతుంది. ఇక ఈ సినిమా తర్వాత వరుస ప్లాపులతో కీర్తి కెరీర్ మొత్తం అగమ్యగోచరంగా తయారయ్యింది. ఇక సర్కారీ వారి పాట సినిమాతో కమర్షియల్ గా కొంత గుర్తింపు తెచ్చుకున్నా.. అదంతా మహేష్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. దీంతో అమ్మడికి ఒక సరైన హిట్ పడాలి అనుకుంటున్న సమయంలో దసరా వచ్చింది. వెన్నెలగా కీర్తి నటన అద్భుతం. మహానటి లాంటి హిట్ కాకపోయినా వరుస ప్లాపులను మైమరిపించే హిట్ నే సొంతం చేసుకుంది. ప్రస్తుతం దసరా సక్సెస్ జోష్ లో ఉన్న ముద్దుగుమ్మ వరుస సినిమాలను లైన్లో పెడుతూ ముందుకు సాగుతుంది.

ఇక మరోపక్క అమ్మడి పెళ్లి వార్తలు నెట్టింట ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక బిజినెస్ మ్యాన్ తో కీర్తి పెళ్లి ఫిక్స్ అయ్యిందని కొన్నిరోజుల క్రితం పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఆ వార్తల్లో అస్సలు నిజం లేదని కీర్తి తల్లి మేనక చెప్పుకొచ్చింది. ఇక తాజాగా కీర్తి కూడా క్లారిటీ ఇచ్చింది కానీ, కొద్దిగా వెరైటీగా. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే కీర్తి ఇటీవలే ఫ్యాన్స్ తో చిట్ చాట్ సెషన్ నిర్వహించింది. అందులో ఒక నెటిజన్.. కీర్తి మీ పెళ్ళెప్పుడు అన్న ప్రశ్నించగా.. కీర్తి కూడా మీమర్స్ లా మారిపోయి పోస్ట్ పెట్టింది. వడివేలు కార్టూన్ అది కూడా రెండు జేబుల్లో ఏముంది..? ఏమి లేదు అన్నది పెట్టింది. అంటే నా చేతిలో ఏముంది.. ఎప్పుడు జరిగితే అప్పుడే అన్నట్లు చెప్పుకొచ్చింది అన్నమాట. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Show comments