Site icon NTV Telugu

Keerthi Suresh : మరో బయోపిక్ లో కీర్తిసురేష్?

Keerthi Suresh In

Keerthi Suresh In

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. గతంలో చేసిన సినిమాలు ఒక ఎత్తు మహానటి సినిమా మరో ఎత్తు.. సావిత్రి గారిలాగే అద్భుతంగా నటించింది.. ఆమె కేరీర్ కు కూడా ఈ సినిమా ప్లస్ అయ్యిందని చెప్పవచ్చు.. సావిత్రిగారు తన అద్భుత నటనతో కట్టిపడేసిన కీర్తి సురేష్ మళ్ళీ దాన్ని తలపించే ఇంకో పాత్ర చేయలేదంటేనే ఆ ప్రభావం ఏ స్థాయిలో ప్రేక్షకుల మనసులో ముద్రించుకుపోయిందో అర్థమవుతుంది.. ఇప్పుడు మరో బయోపిక్ లో కీర్తి సురేష్ నటించబోతుందని ఓ వార్త కొలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది..

ఆ బయోపిక్ ఎవరిదో కాదు.. ప్రముఖ గాయని, గాన కోకిల ఏంఎస్ సుబ్బలక్ష్మి గారిది.. ఈ సినిమా గురించి గతంలో ఎప్పుడో ప్రకటించారు.. కానీ ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ లేదు.. తాజాగా ఈ సినిమాకు హీరోయిన్ ను వెతికేపనిలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఆవిడ జీవితాన్ని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలిసింది. నిర్మాణ సంస్థ, దర్శకుడు తదితర వివరాలు ఇంకా తెలియనప్పటికీ టైటిల్ రోల్ కీర్తి సురేష్ పోషించే అవకాశాలు ఉన్నట్లు కోలివుడ్ లో టాక్..

సుబ్బులక్ష్మి జీవితంలో ఎన్నో ఘట్టాలున్నాయి. మదురైలో ఒక మాములు మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ప్రపంచమంతా కీర్తించే గాయనిగా ఎదిగిన తీరు గురించి సినిమా రాబోతుంది..కీర్తి సురేష్ బాలీవుడ్ సినిమాలతో కూడా ఫుల్ బిజీగా ఉంది.. మరి రీ సినిమా చెయ్యడం కుదరకపోతే త్రిష, నయనతార పేర్లు పరిశీలనలో ఉన్నట్లు టాక్.. మరి దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం..

Exit mobile version