Site icon NTV Telugu

Keerthi Suresh : చిరంజీవి మెగాహ్యూమన్‌.. సినిమా చేశాకే తెలిసింది

Keerthi Suresh

Keerthi Suresh

మెగా ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘భోళాశంకర్‌’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మెగాస్టార్‌ చిరంజీవి, తమన్నా జంటగా మెహర్ రమేశ్‌ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్-ప్యాక్డ్ మూవీ ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే.. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా మహానటి కీర్తి సురేష్‌ నటిస్తున్నారు. అయితే.. భోళా శంకర్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నేడు శిల్పాకళావేదికలో జరిగింది. ఈ ఈవెంట్‌కు విచ్చేసిన కీర్తి సురేష్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం మెగాస్టార్ ఫ్యాన్స్‌కి హాయ్‌.. అందరూ బాగున్నారా.. ఈ సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఒక మెయిన్‌ ట్రాక్‌ ఉంది. ఒక బ్రదర్‌ సిస్టర్‌ ట్రాక్‌.. దానితో పాటు నిజంగానే ఇంకొక బ్రదర్స్ సిస్టర్‌ ట్రాక్‌ జరిగింది. అది నా మెహర్‌ అన్నతో.. థాంక్యూ అన్నా నాకు నిజంగానే ఒక అన్నయ్య దొరికినట్టుంది.. నన్ను మహాలక్ష్మిగా నమ్మినందుకు థాంక్యూ.. చిరుగారి పక్కన నన్ను కూడా అందంగా చూపించినందుకు థాంక్యూ..

Manipur: మణిపూర్‌ సర్కారుకు ఝలక్.. మద్దతు ఉపసంహరించుకున్న మిత్రపక్షం!

ఈ సినిమా చేసేముందు చిరంజీవి మెగాస్టార్‌ అని నాకు తెలుసు కానీ ఇంత మెగా హ్యూమన్‌ అని సినిమా చేసిన తరువాతే తెలిసింది. చిరుగారు షూట్‌లో అందరిని ఎంతో కంఫర్టబుల్‌ పెట్టుకుంటారు. ఆయన ఎనర్జీ, డెడికేషన్‌. క్రమశిక్షణ ఇలా చాలా విషయాలు ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. మీ ఇంట్లో నుంచి వచ్చిన ఫుడ్‌ రోజూ పెట్టినందుకు థాంక్స్‌ అండీ.. స్పెషల్‌ థాంక్స్‌ టూ సురేఖ గారు.. నేను చాలా ఇబ్బంది పెట్టాను.. ఆగస్టు 11కి భోళా శంకర్‌ సినిమా రిలీజ్‌ అవుతోంది తప్పకుండా చూడండి’ అంటూ కీర్తి సురేష్‌ చెప్పుకొచ్చింది. అయితే.. ఈసినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్‌ కనిపించబోతున్నారు. ఈ మూవీలో వీరి ఇద్దరి మధ్య నడిచే ట్రాక్‌ మెయిన్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి కీర్తి సురేష్‌ పాత్ర కీలకమైంది.. అందుకనే మహానటి కీర్తి సురేష్‌ను ఎంచుకున్నట్లు మెహర్‌ రమేశ్‌ చెప్పుకొచ్చారు.

Exit mobile version