Site icon NTV Telugu

Keedaa Cola :మూవీ లవర్స్ కు బంపర్ ఆఫర్ ప్రకటించిన కీడా కోలా టీం..

Whatsapp Image 2023 11 07 At 11.19.49 Pm

Whatsapp Image 2023 11 07 At 11.19.49 Pm

కీడా కోలా.. రీసెంట్ గా విడుదల అయిన ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తుంది..ఈ సినిమా ను యంగ్ డైరెక్టర్ తరుణ్‌ భాస్కర్‌ తెరకెక్కించారు. అలాగే తాను కూడా ఓ కీలక పాత్ర పోషించాడు.ఈ సినిమా లో చైతన్య రావు, మయూర్ రాగ్, జీవన్, బ్రహ్మానందం, జీవన్, రఘురామ్, విష్ణు మరియు రవీంద్ర విజయ్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు… విజి సైన్మా ప్రొడక్షన్ బ్యానర్‌ పై కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్ మరియు ఉపేంద్ర వర్మ కీడా కోలా ను నిర్మించారు.ఈ సినిమా కు వివేక్ సాగర్ మ్యూజిక్ అందించారు..కీడా కోలా మూవీ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తుంది.. ఇదిలా ఉంటే కీడా కోలా మూవీ టీమ్ మూవీ లవర్స్ కు బంపరాఫర్‌ ప్రకటించింది. తమ టికెట్‌ మల్టీప్లెక్స్‌లో రూ. 112 కే పొందవచ్చని వెల్లడించింది. అయితే తెలంగాణ రాష్ట్రంలోని మల్టీప్లెక్స్‌ల్లో మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటు లో ఉందనుందని సూచించింది.

బుధవారం (నవంబర్‌ 8) నుంచి శుక్రవారం (నవంబర్‌ 10) వరకు మూడు రోజుల పాటు ఆ స్పెషల్‌ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చునని చిత్ర యూనిట్ పేర్కొంది. అయితే ఈ ఆఫర్‌లో షరతులు వర్తిస్తాయని నిబంధనలు విధించింది. రెక్లైనర్స్‌కు ఈ ఆఫర్‌ వర్తించదని కూడా సూచించింది. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి ఫీల్‌ గుడ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తరుణ్‌ భాస్కర్‌ కీడా కోలా సినిమాను క్రైమ్‌ కామెడీ నేపథ్యంలో రూపొందించారు.ఈమూవీకి దగ్గుబాటి రానా సమర్పకుడి గా వ్యవహరించడంతో సినిమా పై మరింత ఆసక్తి పెరిగింది..అయితే మరికొంతమంది జనాలకు ఈ సినిమాను అందించాలనే ఉద్దేశంతో కీడా కోల్‌ టీమ్‌ రూ.112 లకే మల్టీప్లెక్స్‌ టికెట్ ఆఫర్‌ ను ప్రకటించింది.

https://twitter.com/SureshProdns/status/1721845828141388179?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1721845828141388179%7Ctwgr%5E61591b29bc193de2e0aa7cab3c2c0a5a8a939d19%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F

Exit mobile version