NTV Telugu Site icon

Keedaa Cola : గ్రాండ్ గా జరగనున్న కీడా కోలా ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ గా రానున్న ఆ స్టార్ హీరో..

Whatsapp Image 2023 10 28 At 4.41.25 Pm

Whatsapp Image 2023 10 28 At 4.41.25 Pm

‘కీడాకోలా’.. ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీపై ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులలో ఎంతో ఆసక్తి నెలకొంది… ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ నగరానికి ఏమైంది చిత్రం తర్వాత డైరెక్షన్‍కు ఐదేళ్ల గ్యాప్ తీసుకొని మరీ తరుణ్ ఈ సినిమాను రూపొందించారు. దీంతో ‘కీడాకోలా’పై అంచనాలు భారీ గానే ఉన్నాయి. ట్రైలర్ చూసిన తర్వాత ఇది కూడా క్రేజీ మూవీగా ఉండనుందని తెలుస్తుంది.. ఇదిలా ఉంటే , కీడాకోలా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍ డేట్ అండ్ టైమ్‍ను మూవీ యూనిట్ ఫిక్స్ చేసింది.కీడాకోలా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ అక్టోబర్ 29న జరగనుంది. హైదరాబాద్‍లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో 29వ తేదీ సాయంత్రం 6.30 గంటల నుంచి ఈ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ ప్రీ-రిలీజ్ కార్యక్రమానికి రౌడీ హీరో విజయ్ దేవరకొండ అతిధిగా హాజరుకానున్నారు. పెళ్లిచూపులు చిత్రంతో తనను హీరోగా నిలబెట్టిన దర్శకుడు తరుణ్ భాస్కర్ కోసం కీడాకోలా ఈవెంట్‍కు విజయ్ అతిధిగా వస్తున్నారు.

కీడాకోలా సినిమా నవంబర్ 3వ తేదీన థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.కీడాకోలా సినిమాలో చైతన్య రావు, బ్రహ్మానందం, విష్ణు ఓయ్, రఘురామ్, జీవన్ కుమార్ మరియు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవలే వచ్చిన కీడాకోలా సినిమా ట్రైలర్ ఎంతో క్రేజీగా ఉంది. టేకింగ్ కూడా ఎంతో డిఫరెంట్‍గా ఉన్నట్టు అర్థమవుతోంది. తరుణ్ భాస్కర్ మార్కుతో కీడాకోలా ఉండనున్నట్టు తెలుస్తోంది. కీడాకోలా సినిమాను ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పిస్తోంది.కీడాకోలా చిత్రాన్ని వీజీ సైన్మా బ్యానర్‌పై వివేక్ సుదాన్షు,సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నందిరాజ్ మరియు ఉపేంద్ర వర్మ సంయుక్తంగా నిర్మించారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇప్పటి వరకు కీడాకోలా నుంచి వచ్చిన పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.కీడాకోలా సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మూవీ యూనిట్ బిజీగా వుంది.వరుసగా ఇంటర్వ్యూలతో మూవీ యూనిట్ సందడి చేస్తోంది. ముఖ్యంగా దర్శకుడు తరుణ్ భాస్కర్ తన మార్క్ పంచ్‍లతో కీడాకోలా సినిమాకు ఫుల్ పబ్లిసిటీ చేస్తున్నాడు.

https://twitter.com/VGSainma/status/1718126955609182415?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1718126955609182415%7Ctwgr%5E205f512357881fdeaa20864ffcbc1f49007768ff%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F

Show comments