Keedaa Cola : గ్రాండ్ గా జరగనున్న కీడా కోలా ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ గా రానున్న ఆ స్టార్ హీరో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘కీడాకోలా’.. ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీపై ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులలో ఎంతో ఆసక్తి నెలకొంది… ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ నగరానికి ఏమైంది చిత్రం తర్వాత డైరెక్షన్‌కు ఐదేళ్ల గ్యాప్ తీసుకొని మరీ తరుణ్ ఈ సినిమాను రూపొందించారు. దీంతో ‘కీడాకోలా’పై అంచనాలు భారీ గానే ఉన్నాయి. ట్రైలర్ చూసిన తర్వాత ఇది కూడా క్రేజీ మూవీగా ఉండనుందని తెలుస్తుంది.. ఇదిలా ఉంటే , కీడాకోలా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ డేట్ అండ్ టైమ్‌ను మూవీ యూనిట్ ఫిక్స్ చేసింది.కీడాకోలా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ అక్టోబర్ 29న జరగనుంది. హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో 29వ తేదీ సాయంత్రం 6.30 గంటల నుంచి ఈ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ ప్రీ-రిలీజ్ కార్యక్రమానికి రౌడీ హీరో విజయ్ దేవరకొండ అతిధిగా హాజరుకానున్నారు. పెళ్లిచూపులు చిత్రంతో తనను హీరోగా నిలబెట్టిన దర్శకుడు తరుణ్ భాస్కర్ కోసం కీడాకోలా ఈవెంట్‌కు విజయ్ అతిధిగా వస్తున్నారు.
కీడాకోలా సినిమా నవంబర్ 3వ తేదీన థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.కీడాకోలా సినిమాలో చైతన్య రావు, బ్రహ్మానందం, విష్ణు ఓయ్, రఘురామ్, జీవన్ కుమార్ మరియు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవలే వచ్చిన కీడాకోలా సినిమా ట్రైలర్ ఎంతో క్రేజీగా ఉంది. టేకింగ్ కూడా ఎంతో డిఫరెంట్‌గా ఉన్నట్టు అర్థమవుతోంది. తరుణ్ భాస్కర్ మార్కుతో కీడాకోలా ఉండనున్నట్టు తెలుస్తోంది. కీడాకోలా సినిమాను ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పిస్తోంది.కీడాకోలా చిత్రాన్ని వీజీ సైన్మా బ్యానర్‌పై వివేక్ సుదాన్షు,సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నందిరాజ్ మరియు ఉపేంద్ర వర్మ సంయుక్తంగా నిర్మించారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇప్పటి వరకు కీడాకోలా నుంచి వచ్చిన పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.కీడాకోలా సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మూవీ యూనిట్ బిజీగా వుంది.వరుసగా ఇంటర్వ్యూలతో మూవీ యూనిట్ సందడి చేస్తోంది. ముఖ్యంగా దర్శకుడు తరుణ్ భాస్కర్ తన మార్క్ పంచ్‌లతో కీడాకోలా సినిమాకు ఫుల్ పబ్లిసిటీ చేస్తున్నాడు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!