NTV Telugu Site icon

Keedaa Cola : ఓటీటీలోకి వచ్చేసిన కీడా కోలా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Whatsapp Image 2023 12 28 At 11.10.33 Pm

Whatsapp Image 2023 12 28 At 11.10.33 Pm

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన కీడా కోలా మూవీ రిలీజ్ కు ముందే ఎంతో ఆసక్తి రేపింది. అందుకు తగినట్లే హైదరాబాద్ నగరంతో పాటు పలు నగరాల్లో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే మూవీకి మిశ్రమ స్పందన రావడంతో బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఓటీటీలో మాత్రం ఈ సినిమాకు మంచి ఆదరణ లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.తరుణ్ భాస్కర్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతోపాటు ఓ పాత్రలో నటించాడు.ఈ సినిమాలో బ్రహ్మానందం, చైతన్య రామ్, రఘు మరియు రవీంద్ర విజయ్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.కీడా కోలా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా దక్కించుకుంది.కీడా కోలా మూవీ తాజాగా ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. నవంబర్ 3న రిలీజైన ఈ సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతోంది.నిజానికి ఆహా సబ్‌స్క్రైబర్లందరికీ శుక్రవారం (డిసెంబర్ 29) నుంచి అందుబాటులోకి రానుంది. అయితే ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వాళ్లు మాత్రం ఒక రోజు ముందే అంటే గురువారం (డిసెంబర్ 28) నుంచే ఈ మూవీని చూడొచ్చు.

దర్శకుడు తరుణ్ భాస్కర్‌ పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలతో యూత్ ని ఎంతగానో అలరించాడు. ఆ రెండు సినిమాలకు భిన్నంగా క్రైమ్ కథాంశంతో కీడా కోలా సినిమాను తెరకెక్కించారు. జోనర్ మార్చిన తనకు మంచి పట్టున్న కామెడీని మాత్రం వదల్లేదు. పేరుకు క్రైమ్ సినిమానే అయినా కూడా నవ్వించడమే మెయిన్ టార్గెట్‌గా పెట్టుకొని కీడా కోలా సినిమాను రూపొందించాడు..ఈ మూవీ లో తరుణ్ భాస్కర్ తన కామెడీ టైమింగ్‌తో మెప్పించాడు. వరదరాజుగా బ్రహ్మానందం పాత్ర ఈ సినిమాకు ప్లస్‌పాయింట్‌గా నిలిచింది.వీల్ చెయిర్‌కు పరిమితమైన పాత్రలో కనిపించి కామెడీని పండించాడు. చైతన్యరావు ను తరుణ్ భాస్కర్‌ కొత్తగా చూపించాడు. అతడిలోని కామెడీ కోణాన్ని దర్శకుడు వాడుకున్న తీరు ఎంతగానో బాగుంది. లాయర్‌గా రాగ్‌మయూర్ మరియు షాట్స్ అనే పాత్రలో విష్ణు క్యారెక్టర్స్ ఎంతగానో అలరిస్తాయి. ఈ సినిమాలో గెటప్ శీను మరియు జీవన్ లు ఎంతగానో మెప్పించారు