Keedaa Cola : ఓటీటీలోకి వచ్చేసిన కీడా కోలా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన కీడా కోలా మూవీ రిలీజ్ కు ముందే ఎంతో ఆసక్తి రేపింది. అందుకు తగినట్లే హైదరాబాద్ నగరంతో పాటు పలు నగరాల్లో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే మూవీకి మిశ్రమ స్పందన రావడంతో బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఓటీటీలో మాత్రం ఈ సినిమాకు మంచి ఆదరణ లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.తరుణ్ భాస్కర్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతోపాటు ఓ పాత్రలో నటించాడు.ఈ సినిమాలో బ్రహ్మానందం, చైతన్య రామ్, రఘు మరియు రవీంద్ర విజయ్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.కీడా కోలా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా దక్కించుకుంది.కీడా కోలా మూవీ తాజాగా ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. నవంబర్ 3న రిలీజైన ఈ సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతోంది.నిజానికి ఆహా సబ్‌స్క్రైబర్లందరికీ శుక్రవారం (డిసెంబర్ 29) నుంచి అందుబాటులోకి రానుంది. అయితే ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వాళ్లు మాత్రం ఒక రోజు ముందే అంటే గురువారం (డిసెంబర్ 28) నుంచే ఈ మూవీని చూడొచ్చు.
దర్శకుడు తరుణ్ భాస్కర్ పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలతో యూత్ ని ఎంతగానో అలరించాడు. ఆ రెండు సినిమాలకు భిన్నంగా క్రైమ్ కథాంశంతో కీడా కోలా సినిమాను తెరకెక్కించారు. జోనర్ మార్చిన తనకు మంచి పట్టున్న కామెడీని మాత్రం వదల్లేదు. పేరుకు క్రైమ్ సినిమానే అయినా కూడా నవ్వించడమే మెయిన్ టార్గెట్‌గా పెట్టుకొని కీడా కోలా సినిమాను రూపొందించాడు..ఈ మూవీ లో తరుణ్ భాస్కర్ తన కామెడీ టైమింగ్‌తో మెప్పించాడు. వరదరాజుగా బ్రహ్మానందం పాత్ర ఈ సినిమాకు ప్లస్‌పాయింట్‌గా నిలిచింది.వీల్ చెయిర్‌కు పరిమితమైన పాత్రలో కనిపించి కామెడీని పండించాడు. చైతన్యరావు ను తరుణ్ భాస్కర్ కొత్తగా చూపించాడు. అతడిలోని కామెడీ కోణాన్ని దర్శకుడు వాడుకున్న తీరు ఎంతగానో బాగుంది. లాయర్‌గా రాగ్‌మయూర్ మరియు షాట్స్ అనే పాత్రలో విష్ణు క్యారెక్టర్స్ ఎంతగానో అలరిస్తాయి. ఈ సినిమాలో గెటప్ శీను మరియు జీవన్ లు ఎంతగానో మెప్పించారు
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Tags
- Aha
- Keeda Cola
- ott streaming
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..