Site icon NTV Telugu

Kedarnath Yatra Bookings : కేదార్‎నాథ్ వెళ్లాలనుకుంటున్నారా.. భలే ఆఫర్

Kedarnath Yatra By Helicopter

Kedarnath Yatra By Helicopter

Kedarnath Yatra Bookings : కేదార్‌నాథ్ యాత్ర కోసం హెలికాప్టర్ బుకింగ్ సేవ ఏప్రిల్ 8వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. IRCTC ద్వారా భక్తులు కేదార్‌నాథ్ యాత్రకు హెలికాప్టర్‌ను బుక్ చేసుకోవచ్చు. IRCTC కేదార్‌నాథ్ వెళ్లే యాత్రికులకు హెలికాప్టర్ బుకింగ్ సౌకర్యాన్ని కల్పించడం ఇదే మొదటిసారి. ఈ సంవత్సరం కేదార్‌నాథ్ యాత్ర ఏప్రిల్ 25న మొదలవుతుంది.

heliyatra.irctc.co.in లింక్ ద్వారా భక్తులు కేదార్‌నాథ్ ధామ్ కోసం హెలికాప్టర్ సర్వీస్‌ను బుక్ చేసుకోవచ్చు. కేదార్‌నాథ్ హెలీ సర్వీస్‌ను బుక్ చేసుకునే ముందు ప్రయాణికుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి. మీరు చార్ ధామ్ యాత్రకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే, ముందుగా మీరు పేరు నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత మీరు కేదార్‌నాథ్ కోసం హెలికాప్టర్ సర్వీస్‌ను బుక్ చేసుకోవచ్చు. మీరు రిజిస్టర్ చేసుకోకుంటే హెలీ సర్వీస్ కోసం ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకోలేరు.

Read Also:Pink Moon: ఈ పౌర్ణమిని “పింక్ మూన్”గా ఎందుకు పిలుస్తారో తెలుసా..?

ఒక వ్యక్తి ఎన్ని టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు
మీరు కేదార్‌నాథ్ కోసం ఆన్‌లైన్‌లో హెలికాప్టర్‌ను బుక్ చేస్తుంటే.. ఒక వ్యక్తి తన IDతో గరిష్టంగా ఆరు సీట్లను మాత్రమే బుక్ చేయగలరు. మీరు కుటుంబం లేదా సమూహంతో ప్రయాణిస్తున్నట్లయితే ఒకేసారి 12 సీట్లను మాత్రమే బుక్ చేసుకోవచ్చు. మీరు కేదార్‌నాథ్ యాత్ర కోసం హెలీ సర్వీస్‌ను బుక్ చేసి, హెలికాప్టర్‌లో ఎక్కడాని కంటే ముందు QR కోడ్‌ని స్కాన్ చేయాల్సి ఉంటుంది. QR కోడ్‌ని స్కాన్ చేయకుండా హెలికాప్టర్లోకి ఎక్కలేరు. టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్‌ను నిరోధించడానికి, వ్యవస్థను మరింత పారదర్శకంగా చేయడానికి ఈ QR కోడ్‌ని స్కాన్ తీసుకువచ్చారు.

Read Also: Jagananna Bhavishattu Live: జగనన్నే మా భవిష్యత్తు కాంపైన్

హెలికాప్టర్ సర్వీస్ ధర
గుప్తకాశీ నుండి కేదార్‌నాథ్‌కు హెలికాప్టర్ సర్వీస్ ధర రూ.3870. గుప్తకాశీ నుంచి వచ్చి వెళ్లాలంటే రూ.7740 చెల్లించాలి. అదే విధంగా, ఫాటా నుండి కేదార్‌నాథ్‌కు వన్‌వే ఛార్జీ రూ.2750, రెండు వైపుల ధర రూ.5500. సిర్సా నుండి కేదార్‌నాథ్‌కి రూ. 2749 మరియు రెండు మార్గాలకు మొత్తం రూ. 5498.

Exit mobile version