Site icon NTV Telugu

Kedarnath: కేదార్‌నాథ్ ఆలయంలో 23 కిలోల బంగారం చోరీ..

Kedarnath Temple

Kedarnath Temple

భారతదేశంలో ని ప్రముఖ దేవాలయాల్లో ఒకటి కేదార్‌నాథ్.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.. ఎప్పుడూ భక్తులతో రద్దీగా ఉండే ఆ ఆలయం లో భారీ చోరీ జరిగిందనే వార్తలు ఆ మధ్య గుప్పుమన్నాయి.. అనేక కథనాలు కూడా వెలువడ్డాయి.. ఆలయంలో 23 కిలోల గోల్డ్‌ చోరీకి గురైందని ఆరోపణలు వచ్చాయి. ఆలయాని కి సమర్పించిన 23.78 కిలోల బంగారం చోరీకి గురైందని కేదార్‌నాథ్ ధామ్‌కు చెందిన తీర్థ పురోహిత్, చార్ధామ్ మహా పంచాయత్ ఉపాధ్యక్షుడు సంతోష్ త్రివేది ఆరోపించారు… ఆ విషయం పెద్ద దుమారం రేపింది.. అయితే ఇప్పుడు ఇది మరోసారి తెరమీదకు వచ్చింది..

ఆలయానికి ఆ బంగారాన్ని ముంబైకి చెందిన ఓ వ్యాపారి విరాళంగా ఇచ్చిన బంగారాన్ని ఆలయ గర్భగుడి గోడలపై పొరలుగా వేశారు. కేదార్‌నాథ్ ఆలయ గర్భగుడిలో బంగారు అలంకరణలో ఆర్థిక అవకతవకలు జరిగాయని గతేడాది కేదార్‌నాథ్ ఆలయానికి సంబంధించిన కొందరు పూజారులు ఆరోపించారు. కానీ BKTC అటువంటి ఆరోపణలు నిరాధారమైనవని, ఇదంతా ఒకరకమైన కుట్ర కోణంగా ఖండించింది. గత సంవత్సరం సెప్టెంబర్-అక్టోబర్‌లో ఆలయ గర్భగుడిలో బంగారు తాపడం పనులు జరిగాయని త్రివేది ఆరోపించారు..

ఇక అసలు దాత బంగారాన్ని ఇచ్చారా.. ఎంత ఇచ్చారు.. ఎప్పుడూ ఇచ్చారు.. మరి ఎందుకు బంగారం లో రాగి కలిపారు అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.. కేదార్‌నాథ్ మాత్రమే కాదు, బద్రీనాథ్‌కు కూడా ఇలాంటి స్కామ్‌పై సమాచారం అందుతున్నదని ఆయన అన్నారు. పెరుగుతున్న వివాదం మధ్య, ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇప్పుడు సాంస్కృతిక, మత వ్యవహారాల కార్యదర్శి హరిచంద్ర సెమ్వాల్, గర్వాల్ కమిషనర్ నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో నిపుణుల తో పాటు స్వర్ణకారులు ఉంటారని మంత్రి మహరాజ్ తెలిపారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు… గతంలో చాలా సార్లు ఇలాంటి వార్తలు వచ్చినట్లు ఆయన తెలిపారు.. ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు..

Exit mobile version