Kedarnath: కేదార్‌నాథ్ ఆలయంలో 23 కిలోల బంగారం చోరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో ని ప్రముఖ దేవాలయాల్లో ఒకటి కేదార్‌నాథ్.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.. ఎప్పుడూ భక్తులతో రద్దీగా ఉండే ఆ ఆలయం లో భారీ చోరీ జరిగిందనే వార్తలు ఆ మధ్య గుప్పుమన్నాయి.. అనేక కథనాలు కూడా వెలువడ్డాయి.. ఆలయంలో 23 కిలోల గోల్డ్ చోరీకి గురైందని ఆరోపణలు వచ్చాయి. ఆలయాని కి సమర్పించిన 23.78 కిలోల బంగారం చోరీకి గురైందని కేదార్‌నాథ్ ధామ్‌కు చెందిన తీర్థ పురోహిత్, చార్ధామ్ మహా పంచాయత్ ఉపాధ్యక్షుడు సంతోష్ త్రివేది ఆరోపించారు… ఆ విషయం పెద్ద దుమారం రేపింది.. అయితే ఇప్పుడు ఇది మరోసారి తెరమీదకు వచ్చింది..
ఆలయానికి ఆ బంగారాన్ని ముంబైకి చెందిన ఓ వ్యాపారి విరాళంగా ఇచ్చిన బంగారాన్ని ఆలయ గర్భగుడి గోడలపై పొరలుగా వేశారు. కేదార్‌నాథ్ ఆలయ గర్భగుడిలో బంగారు అలంకరణలో ఆర్థిక అవకతవకలు జరిగాయని గతేడాది కేదార్‌నాథ్ ఆలయానికి సంబంధించిన కొందరు పూజారులు ఆరోపించారు. కానీ BKTC అటువంటి ఆరోపణలు నిరాధారమైనవని, ఇదంతా ఒకరకమైన కుట్ర కోణంగా ఖండించింది. గత సంవత్సరం సెప్టెంబర్-అక్టోబర్‌లో ఆలయ గర్భగుడిలో బంగారు తాపడం పనులు జరిగాయని త్రివేది ఆరోపించారు..
Also Read
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
ఇక అసలు దాత బంగారాన్ని ఇచ్చారా.. ఎంత ఇచ్చారు.. ఎప్పుడూ ఇచ్చారు.. మరి ఎందుకు బంగారం లో రాగి కలిపారు అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.. కేదార్‌నాథ్ మాత్రమే కాదు, బద్రీనాథ్‌కు కూడా ఇలాంటి స్కామ్‌పై సమాచారం అందుతున్నదని ఆయన అన్నారు. పెరుగుతున్న వివాదం మధ్య, ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇప్పుడు సాంస్కృతిక, మత వ్యవహారాల కార్యదర్శి హరిచంద్ర సెమ్వాల్, గర్వాల్ కమిషనర్ నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో నిపుణుల తో పాటు స్వర్ణకారులు ఉంటారని మంత్రి మహరాజ్ తెలిపారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు… గతంలో చాలా సార్లు ఇలాంటి వార్తలు వచ్చినట్లు ఆయన తెలిపారు.. ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు..
తాజావార్తలు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!