NTV Telugu Site icon

Keanu Reeves: ఇంతకూ… కీనూ రీవ్స్‌కు ఏమయ్యింది!?

Keanu Reeves

Keanu Reeves

\Keanu Reeves: మ్యాట్రిక్స్’ స్టార్ కీనూ రీవ్స్ కు స్డూడియోస్ లో డిజిటల్ ఎడిట్స్ పై మొహం మొత్తిందట! ‘మ్యాట్రిక్స్’కు ముందు, ఆ తరువాత కూడా కీనూ రీవ్స్ యాక్షన్ హీరోగా పలు చిత్రాలతో వినోదం పంచాడు. మార్చి 24న కీనూ రీవ్స్ తాజా చిత్రం ‘జాన్ విక్ : చాప్టర్ 4’ జనం ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ యాక్షన్ కింగ్ ఈ స్టేట్ మెంట్ ఇవ్వడం కాసింత ఆశ్చర్యం కలిగిస్తోంది. డిజిటల్ టెక్నాలజీ వచ్చిన తరువాత నిజజీవితంలో అసాధ్యాలు, తెరపై సుసాధ్యంగా మారాయి. అయితే వాటి కోసం నటీనటులు ఎంతో సేపు స్టూడియోస్ లో నిరీక్షంచవలసి ఉంటుంది. గ్రాఫిక్స్ మాయాజాలం జరగాలంటే తప్పకుండా నటీనటులు ఓపీకతో స్టూడియోల్లో ఉండాల్సిందే. ఈ విషయంలోనే కాదు, చివరకు నటీనటుల హావభావాలను సైతం డిజిటల్ టెక్నాలజీ శాసించడంపైనే కీనూ రీవ్స్ విసుగు చెందాడట!

Shiva Karthikeyan: మరో క్యాచీ సాంగ్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్న శివ కార్తికేయన్

తన అభినయాన్ని డిజిటల్ టెక్నాలజీతో తారు మారు చేయడాన్ని కీనూ రీవ్స్ అంగీకరించడం లేదు. మరి ఇన్నాళ్ళు ఎందుకని అంగీకరించినట్టు? ఈ ప్రశ్నకు సమాధానంగా తనకిప్పుడే జ్ఞానోదయమైంది అంటున్నాడు కీనూ. 90లలో కొత్త టెక్నాలజీ అనుకొని ముందుకు సాగామని, అయితే దానినే 21వ శతాబ్దంలో మరింతగా ఉపయోగించారనీ గుర్తు చేసుకుంటున్నాడు రీవ్స్. భూగర్భంలోకి వెళ్ళినట్టు, అక్కడ సంచరించినట్టు చిత్రీకరిస్తున్నామని, ఇదంతా నటనే అయినా, అందులోనూ నటించడానికి అవకాశం ఉండడం లేదని వాపోతున్నాడు కీనూ రీవ్స్. ప్రస్తుతం ప్రపంచంలోని జాతులపై అధ్యయనం సాగుతోందని, తద్వారా ప్రతి జీవి కదలికలు, జీవనవిధానంపై ఎంతో ‘డేటా’ సేకరిస్తున్నారని కీనూ అంటున్నాడు. వీటి ద్వారా మరింత టెక్నాలజీతో సినీజనం మరిన్ని వింతలు చూపించబోతున్నారని ఆయన చెప్పాడు. ఈ నేపథ్యంలో ఓ నటుడు కానీ, నటి కానీ నిజంగానే డూప్ లేకుండా ఫైట్స్ చేసినా, జనం నమ్మరనీ గుర్తు చేస్తున్నాడు. వీటన్నిటినీ కార్పొరేట్ సెక్టార్స్ నడిపిస్తున్నాయని, వాటికి అనుకూలంగానే సినిమాల్లోనూ టెక్నాలజీ చోటు చేసుకోవడం విచారకరమని కీనూ రీవ్స్ అంటున్నాడు. ఏది ఏమైనా ఇకపై స్టూడియోస్ లో డిజిటల్ ఎడిట్స్ కు రీనూ దూరమైతే, ఆయనతో సినిమాలు తీసే వారి పరిస్థితి ఏంటి? మరి రాబోయే కీనూ రీవ్స్ ‘జాన్ విక్: చాప్టర్ 4’లో ఆయన ఏ సాహసాలు చేసినా, వాటిని ఫేక్ అని జనం అంటారా? లేక కథకే ప్రాధాన్యమిస్తారా? చూద్దాం