Keanu Reeves: ఇంతకూ… కీనూ రీవ్స్‌కు ఏమయ్యింది!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
\Keanu Reeves: మ్యాట్రిక్స్’ స్టార్ కీనూ రీవ్స్ కు స్డూడియోస్ లో డిజిటల్ ఎడిట్స్ పై మొహం మొత్తిందట! ‘మ్యాట్రిక్స్’కు ముందు, ఆ తరువాత కూడా కీనూ రీవ్స్ యాక్షన్ హీరోగా పలు చిత్రాలతో వినోదం పంచాడు. మార్చి 24న కీనూ రీవ్స్ తాజా చిత్రం ‘జాన్ విక్ : చాప్టర్ 4’ జనం ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ యాక్షన్ కింగ్ ఈ స్టేట్ మెంట్ ఇవ్వడం కాసింత ఆశ్చర్యం కలిగిస్తోంది. డిజిటల్ టెక్నాలజీ వచ్చిన తరువాత నిజజీవితంలో అసాధ్యాలు, తెరపై సుసాధ్యంగా మారాయి. అయితే వాటి కోసం నటీనటులు ఎంతో సేపు స్టూడియోస్ లో నిరీక్షంచవలసి ఉంటుంది. గ్రాఫిక్స్ మాయాజాలం జరగాలంటే తప్పకుండా నటీనటులు ఓపీకతో స్టూడియోల్లో ఉండాల్సిందే. ఈ విషయంలోనే కాదు, చివరకు నటీనటుల హావభావాలను సైతం డిజిటల్ టెక్నాలజీ శాసించడంపైనే కీనూ రీవ్స్ విసుగు చెందాడట!
Shiva Karthikeyan: మరో క్యాచీ సాంగ్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్న శివ కార్తికేయన్
Also Read
- Russian Ruble: డాలర్‌కు బిగ్ షాక్.. ప్రపంచంలోనే బెస్ట్ కరెన్సీగా రూబుల్.. వరుసగా రెండో ఏడాది రికార్డ్..
- Modi-Meloni Selfie Goes Viral: వైరల్‌గా మారిన మోడీ-మెలోని కొత్త సెల్ఫీ..
- Mamata Banerjee: కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయం.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
- AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
తన అభినయాన్ని డిజిటల్ టెక్నాలజీతో తారు మారు చేయడాన్ని కీనూ రీవ్స్ అంగీకరించడం లేదు. మరి ఇన్నాళ్ళు ఎందుకని అంగీకరించినట్టు? ఈ ప్రశ్నకు సమాధానంగా తనకిప్పుడే జ్ఞానోదయమైంది అంటున్నాడు కీనూ. 90లలో కొత్త టెక్నాలజీ అనుకొని ముందుకు సాగామని, అయితే దానినే 21వ శతాబ్దంలో మరింతగా ఉపయోగించారనీ గుర్తు చేసుకుంటున్నాడు రీవ్స్. భూగర్భంలోకి వెళ్ళినట్టు, అక్కడ సంచరించినట్టు చిత్రీకరిస్తున్నామని, ఇదంతా నటనే అయినా, అందులోనూ నటించడానికి అవకాశం ఉండడం లేదని వాపోతున్నాడు కీనూ రీవ్స్. ప్రస్తుతం ప్రపంచంలోని జాతులపై అధ్యయనం సాగుతోందని, తద్వారా ప్రతి జీవి కదలికలు, జీవనవిధానంపై ఎంతో ‘డేటా’ సేకరిస్తున్నారని కీనూ అంటున్నాడు. వీటి ద్వారా మరింత టెక్నాలజీతో సినీజనం మరిన్ని వింతలు చూపించబోతున్నారని ఆయన చెప్పాడు. ఈ నేపథ్యంలో ఓ నటుడు కానీ, నటి కానీ నిజంగానే డూప్ లేకుండా ఫైట్స్ చేసినా, జనం నమ్మరనీ గుర్తు చేస్తున్నాడు. వీటన్నిటినీ కార్పొరేట్ సెక్టార్స్ నడిపిస్తున్నాయని, వాటికి అనుకూలంగానే సినిమాల్లోనూ టెక్నాలజీ చోటు చేసుకోవడం విచారకరమని కీనూ రీవ్స్ అంటున్నాడు. ఏది ఏమైనా ఇకపై స్టూడియోస్ లో డిజిటల్ ఎడిట్స్ కు రీనూ దూరమైతే, ఆయనతో సినిమాలు తీసే వారి పరిస్థితి ఏంటి? మరి రాబోయే కీనూ రీవ్స్ ‘జాన్ విక్: చాప్టర్ 4’లో ఆయన ఏ సాహసాలు చేసినా, వాటిని ఫేక్ అని జనం అంటారా? లేక కథకే ప్రాధాన్యమిస్తారా? చూద్దాం
తాజావార్తలు
-
Riyan Parag: మేము కూడా మనుషులమే, తప్పులు జరుగుతాయి.. ఇక్కడ మిస్టర్ పర్ఫెక్ట్ ఎవడూ లేడు!
-
TeluguOne Ravi Shankar: పంచభూతాల సాక్షిగా డైరెక్టర్‌గా మారిన తెలుగు వన్ రవిశంకర్!
-
Russian Ruble: డాలర్‌కు బిగ్ షాక్.. ప్రపంచంలోనే బెస్ట్ కరెన్సీగా రూబుల్.. వరుసగా రెండో ఏడాది రికార్డ్..
-
Dragon Glimpse Review: ప్రశాంత్ నీల్ ఊరమాస్ ఎలివేషన్స్ ఓకే.. కానీ ఎన్టీఆర్ లుక్కే అలా ఉందేంటి? ‘డ్రాగన్’ గ్లింప్స్ రివ్యూ!
-
Sridevi: ‘కోర్ట్’ హీరోయిన్‌కు జాక్‌పాట్..రజినీకాంత్ మూవీలో శ్రీదేవి..?
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?