NTV Telugu Site icon

KCR: నేడు జగిత్యాలలో కేసీఆర్ రోడ్ షో

Kcr

Kcr

Telangana: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జగిత్యాల పట్టణంలో నేడు (ఆదివారం) పర్యటించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డికి మద్దతుగా పట్టణంలో నిర్వహించే రోడ్డు షోలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, పార్టీ ముఖ్య నాయకులు కొత్త బస్ స్టాండ్ దగ్గర ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Read Also: Loksabha Elections 2024 : నేటితో మూడో దశ ఎన్నికల ప్రచారానికి తెర..మే 7న 94 స్థానాల్లో ఓటింగ్

కాగా, నేటి సాయంత్రం 5 గంటలకు జగిత్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ రోడ్డు షోలో పాల్గొననున్నారు. జిల్లా కేంద్రంలోని కొత్త బస్సు స్టాండ్ చౌరస్తా మీదుగా అంగడి బజార్, తహసీల్ చౌరస్తా, ఓల్డ్ బస్సు స్టాండ్ చౌరస్తా వరకు ఈ రోడ్ షో కొనసాగనుంది. అలాగే, ఓల్డ్ బస్టాండ్ చౌరస్తా దగ్గర ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధితో పాటు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలపై విమర్శలు కురిపించే అవకాశం కూడా ఉంది.