తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగానికి ఇతోధిక ప్రాధాన్యత ఇస్తోంది. తాజాగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు న్యూట్రిషన్ కిట్లను పెద్ద ఎత్తున 9 జిల్లాల్లోని గర్బిణులకు అందించనున్నారు, రూ. 50 కోట్ల వ్యయంతో గర్బిణులకు వరంగా పథకం అమలుచేయనున్నారు. కామారెడ్డి నుంచి వర్చువల్గా ప్రారంభించనున్నారు మంత్రి హరీశ్ రావు. ఆయా జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు మంత్రులు, ప్రజాప్రతినిధులు. గర్భిణిలు ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనిస్తారని, తద్వారా ఆరోగ్యవంతమైన తెలంగాణను నిర్మించుకోవచ్చు అంటున్నారు మంత్రి హరీష్ రావు.
ఒక్కో న్యూట్రిషన్ కిట్ తయారీకి 2వేల రూపాయల ఖర్చయింది. తొమ్మిది జిల్లాల్లో మొత్తం లక్షా 24 వేల 776 న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేస్తారు. ఆదిలా బాద్ జిల్లాలో 15,405 కిట్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మొత్తం 16,898 కిట్లు, జయశంకర్ భూపాలపల్లికి 6843 కిట్లు గర్బిణిలకు పంపిణీ చేయనున్నారు. అలాగే జోగులాంబ గద్వాల జిల్లాకు 15,455 కిట్లు, కొమురం భీం జిల్లాకు 10 వేల 309 కిట్లు, ములుగు జిల్లాకు అత్యల్పంగా 5202, నాగర్ కర్నూలు జిల్లాకు 17,145 కిట్లు, కామారెడ్డి జిల్లాకు 19,490 కిట్లు, వికారాబాద్ జిల్లాకు 18,029 కిట్లు పంపిణీ చేయనున్నారు. ఈ న్యూట్రిషన్ కిట్ల ద్వారా గర్భిణీలకు మంచి పోషకాహారం అందనుంది.
Read Also: Vishal: పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం కానీ ఓటు మాత్రం అతనికే వేస్తాను
ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్బిణీలకు అన్నిరకాల టెస్ట్ లు, పోషకాహారం అందిస్తూ నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సాధారణ కాన్పులు చేసే వైద్యులకు ప్రత్యేక పారితోషికాలు అందిస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వం అందించనున్న న్యూట్రిషన్ కిట్ల ప్యాకింగ్ కూడా ఆకర్షణీయంగా వుంది. ఈ పథకం పట్ల గర్భిణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కిట్ లో అరకిలో నెయ్యి. కిలో ఖర్జూర పండ్లు, ఒక్కొక్కటి కిలో చొప్పున రెండు హార్లిక్స్ బాటిల్స్, ఇతర పోషక పదార్థాలు ఉండనున్నాయి.
Read ALso: Laththi Movie: విశాల్ ‘లాఠీ’కి ఓపెనింగ్స్ వచ్చేనా?