బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేడు తెలంగాణ భవన్ లో ఉదయం 11 గంటలకు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, నియోజకవర్గాల ఇంచార్జ్ లతో సమావేశం కానున్నారు. పార్టీ అభ్యర్థులకు గులాబీ బాస్ బీ-ఫారాలు అందజేయనున్నారు. ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం.. అనంతరం 12.15 నిమిషాలకు మ్యానిఫెస్టో విడుదల, మ్యానిఫెస్టోపై ప్రసంగం చేయనున్నారు. తెలంగాణ భవన్ లోనే పార్టీ అభ్యర్థులు, ఇంచార్జ్ లతో కేసీఆర్ మధ్యాహ్నం భోజనం చేయనున్నారు.
Read Also: Food Inflation: కేంద్రం దీపావళి కానుక.. భారీగా తగ్గనున్న బియ్యం ధరలు
ఆ తరవాత ప్రగతి భవన్ కు సీఎం కేసీఆర్ చేరుకోనున్నారు. సాయంత్రం 4.50 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో హుస్నాబాద్ బయల్దేరి వెళ్లనున్నారు. హుస్నాబాదులో ఎన్నికల ప్రచార శంఖారావం సభలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాల్గొననున్నారు. అయితే, బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ మేనిఫెస్టోను విడుదల చేయనుండగా.. అందులో కీలక హామీలను పొందుపరిచిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పేదలు, రైతులు, మహిళలు లక్ష్యంగా ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించినట్లు సమాచారం.
Read Also: Thaman: బాలయ్య మత్తు నుంచి బయటకి వచ్చి… గుంటూరు కారం ఘాటు చూపించు
అయితే, గత పథకాలను కొనసాగిస్తూ కొత్త పథకాలను బీఆర్ఎస్ మేనిఫెస్టోలో చేర్చింది. సహచర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నిపుణులు, ఆర్థికవేత్తలు, సామాజిక వేత్తల అభిప్రాయాలు తెలుసుకుని మేనిఫెస్టోను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఇతర రాష్ట్రాలు, ఇతర పార్టీల ఎన్నికల హామీలు, అమలు తీరును కూడా సీఎం కేసీఆర్ పరిశీలించినట్లు గులాబీ పార్టీ వర్గీయులు వెల్లడించారు. మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత.. ప్రగతి భవన్ కి వెళ్లి సాయంత్రం హుస్నాబాద్ లో జరిగే మొదటి ఎన్నికల ప్రచార సభలో కేసీఅర్ పాల్గొననున్నారు.