Site icon NTV Telugu

KC Venugopal: టికెట్ రాని నేతలకు కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసి కీలక హామీ

Kc Venugopal

Kc Venugopal

తెలంగాణ కాంగ్రెస్ లో అసంతతృప్తుల బుజ్జగింపులు దాదాపు కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తున్నాయి. పార్టీ నుంచి టికెట్ ఆశించిన భంగపడ్డ 20 మంది నేతలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసి మాట్లడుతున్నారు. ఇక, ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసిన వారిలో ఎన్‌ఎస్‌యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరీ వెంకట్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, బలరాం నాయక్, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డితో సహా 20 మందికి కేసీ వేణుగోపాల్ కీలక హామీ ఇచ్చారు. టికెట్ రాలేదని మీరు అధైర్య పడొద్దు.. తెలంగాణలో పూర్తి మెజార్టీతో ప్రభుత్వం రాబోతోందని ఆయన వెల్లడించారు.

Read Also: Payal Rajput: ట్రెండీ అందాలతో హీటెక్కిస్తున్న పాయల్ రాజ్‌పుత్

అయితే, టికెట్ రాని వారు ఎవరిని చూసి ఇబ్బంది పడొద్దని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. ప్రభుత్వంలో టికెట్ రాని నేతలు కూడా భాగస్వామ్యం అవుతారని ఆయన చెప్పుకొచ్చారు. మీ అందరి రాజకీయ భవిష్యత్తుకు బాధ్యత నాదే అని కేసీ వేణుగోపాల్ భరోసా ఇచ్చారని తెలుస్తుంది. మరోవైపు తుంగతుర్తి టికెట్ ఆశించిన కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశారు.

Exit mobile version