Bus Stops Changed: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ఎఫెక్ట్.. ఆ ప్రదేశంలో బస్ స్టాప్స్ మార్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ చేపడుతున్న అభివృద్ధి పనుల నేపథ్యంలో ఆర్టీసీ బస్సు ప్రయాణికులు, వాహనదారుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్‌స్టాప్‌ల మార్పుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. నూతన ట్రాఫిక్ విధానం వల్ల ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్‌స్టాప్‌ల స్థానాలను మార్చే అంశంపై ఆర్టీసీ అధికారులతో నిరంతరం చర్చిస్తున్నామని, త్వరితగతిన రీ-షెడ్యూల్ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. రెండు ప్రాంతాల్లో విపరీతంగా ట్రాఫిక్ ఉన్నట్లు గుర్తించామని.. అక్కడ ట్రాఫిక్ సమస్యలను క్లియర్ చేస్తున్నామని పేర్కొన్నారు.
కేబీఆర్ పార్క్ చుట్టూ జూబ్లీహిల్స్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ పనుల దృష్ట్యా ట్రాఫిక్ పోలీసులు ఉదయం 6 గంటల నుంచే వన్-వే విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. పంజాగుట్ట నుంచి వచ్చే వాహనాలు కేబీఆర్ పార్క్ సర్కిల్ ఎంట్రెన్స్ వద్ద తప్పనిసరిగా ఎడమవైపు (క్యాన్సర్ ఆసుపత్రి మార్గం) మళ్లాల్సి ఉంటుంది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు నుంచి కేబీఆర్ పార్క్ మీదుగా పంజాగుట్ట వెళ్లే వాహనాలకు మాత్రమే స్ట్రెయిట్ మార్గంలో అనుమతి ఉంది.
Also Read
- Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే "బీట్రూట్ హల్వా" ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
- IND Vs SL: టీమిండియాకు షాక్.. తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్ డకౌట్..
- Deputy Tahsildar: దారుణ ఘటన.. ఖమ్మం జిల్లా డిప్యూటీ తహశీల్దార్ ఆత్మహత్య..
- Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!
రోడ్ నం. 45 నుంచి వచ్చే వాహనాలు చెక్‌పోస్టు వైపు మాత్రమే వెళ్లాల్సి ఉండగా, రోడ్ నం. 12 నుంచి వచ్చే వాహనాలకు అగ్రసేన్ సర్కిల్ వద్ద కుడివైపునకు తిరిగే (రైట్ టర్న్) అవకాశం లేదు. ఈ ప్రాంతంలో నిబంధనలు ఉల్లంఘించి రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ప్రాంతమంతటా సీసీ కెమెరాలు, డ్రోన్లతో ట్రాఫిక్‌ను పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
సమర్థవంతమైన నిర్వహణ కోసం దాదాపు 1000 మంది సిబ్బందిని రంగంలోకి దించారు. కేబీఆర్ పార్క్ చుట్టూ వచ్చే ఏడాదిన్నర నుంచి రెండేళ్ల పాటు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని, వాహనదారులు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ మళ్లింపుల సమగ్ర సమాచారం కోసం పౌరులు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ పోర్టల్ ను సందర్శించవచ్చు.
తాజావార్తలు
-
Bus Stops Changed: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ఎఫెక్ట్.. ఆ ప్రదేశంలో బస్ స్టాప్స్ మార్పు..
-
This Week Theatrical Releases: పృథ్వీరాజ్ ‘ఖలీఫా పార్ట్ 1’ నుండి రవి తేజ ‘ఇరుముడి’ వరకు.. ఈ వారం థియేటర్లలో చూడాల్సిన సౌత్ సినిమాలు..
-
Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే “బీట్రూట్ హల్వా” ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
-
IND vs SL: గాలె టెస్టులో అంపైర్‌ను వణికించిన డీఎస్పీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. వీడియో వైరల్!
-
Mega 158 : చిరు – బాబీ సినిమాకు దాదాపు ఆ టైటిల్ ఫిక్స్ ?
ట్రెండింగ్
-
Sanjay Manjrekar: లైవ్‌లో మాజీ క్రికెటర్ల మధ్య వార్.. అద్దంలో చూసుకో అంటూ ఒకరిపై మరొకరు సెటైర్లు!
-
Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!
-
Jio Prime Membership: గుడ్‌న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!