NTV Telugu Site icon

Sushil Kumar : ఒకప్పుడు రూ.5 కోట్ల విన్నర్…. ప్రస్తుతం పాలమ్ముకుంటున్నాడు, అసలేమైంది?

Kbc

Kbc

డబ్బులు సంపాదించడం గొప్ప కాదు దానిని ఎంత బాగా ఉపయోగించుకున్నాం అన్న దానిపైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. చాలా మందికి లక్కీగా లాటరీలోనో, ఏదో ఒక గేమ్ షోలోనో కోట్లలో డబ్బు వస్తూ ఉంటుంది. దీంతో వారు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతూ ఉంటారు. లాటరీలో తగిలే లక్ గురించి పక్కన పెడితే ఇలా ఎంతో మందిని రాత్రికి రాత్రే రిచ్ గా మార్చేసింది ప్రముఖ గేమ్ షో ”కౌన్ బనేగా కరోడ్ పతి”. అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా చేస్తున్న ఈ షో కు దేశ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీ ఉంది. ఈ గేమ్ షో ఒక్కరోజులోనే ఎంతో మంది తలరాతలను మార్చేసింది. ఎంతో మంది ఈ గేమ్ షోలో పాల్గొని తమ నాలెడ్జ్ ద్వారా కోట్లు సంపాదించారు. అటువంటి వారిలో ఒకరు కేబీసీ సీజన్ 5 విన్నర్ సుశీల్ కుమార్.

2011లో ఈ షోలో చివరి ప్రశ్నకు కూడా సమాధానం ఇచ్చి ఐదు కోట్ల రూపాయలు సంపాదించాడు. దీంతో ఒక్కసారిగా అతని జీవితమే మారిపోయింది. అప్పటి వరకు నార్మల్ వ్యక్తిగా ఉన్న సుశీల్ కుమార్ సెలబ్రెటీ అయిపోయాడు. గేమ్ షోలో వచ్చిన 5 కోట్లతోపాటు అతనికి స్నేహితులు, బంధువులు కూడా పెరిగారు. సుశీల్ కుమార్ కు వచ్చిన పాపులారిటీలతో స్వచ్చంధ సంస్థలు, ప్రజా సంఘాలు , స్కూల్స్, కాలేజీలు… సభలు, సమావేశాలకు ఆహ్వానించాయి. అంతేకాకుండా అతని నుంచి ఎన్నో డొనేషన్లు కూడా తీసుకున్నాయి. ఉన్నపళంగా డబ్బులు వచ్చి పడటంతో సుశీల్ కుమార్ కూడా వెనకా ముందూ చూడలేదు. తన దగ్గర ఉన్న డబ్బును విరాళాలుగా ఇస్తూ.. పేపర్లు, టీవీల్లో కనిపిస్తూ తానొక సెలబ్రెటీ అన్నట్లు ఎంజాయ్ చేశాడు.

Also Read :Viral News: ఇదేం లవ్ రా బాబు… 66 ఏళ్ల వృద్దుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న 23 ఏళ్ల కుర్రాడు..!

ఫ్రెండ్స్, పబ్బులు, మందు పార్టీలు అంటూ బాగా అలవాటు పడిపోయాడు. తన లైఫ్ స్టైల్ మొత్తాన్నే మార్చేసుకున్నాడు. అలా జల్సాలకు అలవాటు పడటంతో భార్య కూడా వదిలేసింది. తిప్పికొడితే నాలుగేళ్లలో సంపాదించింది మొత్తం పొగొట్టుకున్నాడు. డబ్బుతో దగ్గరైన వారందరూ ఒక్కసారిగా దూరమయ్యి పోవడంతో ఒంటరిగా మిగిలిపోయాడు. ప్రస్తుతం బతకడం కోసం రెండు గేదెలను కొనుక్కొని వాటి పాలను అమ్ముతూ బతుకుతున్నాడు. తనకు వచ్చిన డబ్బును చక్కగా వినియోగించుకుంటే జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉన్న సుశీల్ కుమార్ తన చేతులతోనే జీవితాన్ని నాశనం చేసుకున్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Show comments