ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మ్యాచ్ ఆడుతుందంటే.. ఆటగాళ్ల కంటే ఎక్కువగా ఆ జట్టు సహ యజమాని కావ్య మారన్ పైనే అందరి కళ్లు ఉంటాయి. మ్యాచ్ జరుగుతున్నంతసేపూ ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాళ్లను ఉత్సహపరుస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మాత్రం నిరాశగా ఉంటారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కావ్య పాపపై ఎక్కువగా మీమ్స్ వస్తూ ఉంటాయి. తాజాగా తనపై వచ్చే మీమ్స్‌పై స్పందించారు. క్రికెట్ మీద తనకున్న మక్కువ వల్లే తాను ట్రోలింగ్‌కు గురవుతుంటానని చెప్పారు.
ఇన్‌సైడ్‌స్పోర్ట్ చాట్‌లో కావ్య మారన్ మాట్లాడుతూ… ‘సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు హైదరాబాద్‌లో ఆడినప్పుడు నేను ఏమీ చేయలేను. నేను ఒకచోట కూర్చోవాలి. అహ్మదాబాద్, చెన్నైలకు కూడా నేను టీమ్‌ను ఉత్సాహపరచడానికి వెళుతుంటా. నేను ఎక్కడో దూరంలో కూర్చున్నా కెమెరామెన్ నా హావభావాలను బంధిస్తాడు. అందుకే అవి మీమ్స్‌గా మారుతున్నాయి. మ్యాచ్ జరుగుతున్నపుడు ఒక్కోసారి ఓకోలా ఉంటాం. సంతోషం, ఎమోషన్స్, భాద.. ఇలా ఈ హావభావాలను కెమెరామెన్ బంధిస్తాడు. అవే మీమ్స్‌గా మారతాయి’ అని చెప్పారు.
2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజ్ చివరిసారిగా ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. డేవిడ్ వార్నర్ అద్భుత కెప్టెన్సీతో జట్టును విజేతగా నిలిపాడు. 2016 నుంచి మరో టైటిల్ గెలవలేదు. 2018, 2024లో ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకున్నా విజేతగా నిలవలేదు. ఇక 2025 సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ పేలవ ప్రదర్శన చేసింది. సీజన్ ఆరంభంలో అలరించిన ఎస్‌ఆర్‌హెచ్.. ఆపై వరుస పరాజయాలతో మూల్యం చెల్లించుకుంది.
