NTV Telugu Site icon

Kavya Maran: కావ్య మేడం క్రేజా మజాకా.. అక్కడ కూడా వదలట్లేదుగా!

Kavya Maaran

Kavya Maaran

Kavya Maran: కావ్య మారన్.. క్రికెట్ ఫ్యాన్స్‌కు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్‌గా వ్యవహరిస్తున్న ఈమెకు స్టార్ క్రికెటర్ల స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇండియాలో అయితే ఓకే.. కానీ కావ్య క్రేజ్ ప్రస్తుతం ఖండాలు దాటుతోంది. తాజాగా సౌతాఫ్రికాలో జరుగుతున్న టీ20 లీగ్‌లోనూ ఆమె క్రేజ్ కనిపిస్తోంది. మ్యాచ్ జరుగుతున్నప్పుడు తమ ఫేవరేట్ క్రికెటర్లపై తమ అభిమానాన్ని ప్లకార్డుల ద్వారా ప్రదర్శిస్తుంటారు ఫ్యాన్స్. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ ఇలాంటి ఓ పెళ్లి ప్రపోజల్ నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఇది ఎవరికో కాదు.. IPL మిస్టరీ గర్ల్‌గా పేరు తెచ్చుకున్న కావ్యకు అక్కడి నుంచి లవ్ ప్రపోజల్ వచ్చింది. ‘కావ్య మారన్ నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అన్న ఫ్లకార్డు పట్టుకుని ఓ అభిమాని తన ప్రేమను వ్యక్తపరిచాడు. కాగా, ఈ లీగ్‌లో సన్‌రైజర్స్ యాజమాన్యం ఈస్టర్న్ కేప్‌ జట్టును కొనుగోలు చేసింది. దీనికి కావ్య ఓనర్‌ కావడం విశేషం.

Ambani Dance Video: అనంత్-రాధిక ఎంగేజ్‌మెంట్‌లో అంబానీలు డ్యాన్స్‌తో అదరగొట్టేశారుగా..

గురువారం సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్-పార్ల్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలోనే కావ్య మారన్‌కు పెళ్లి ప్రపోజల్ పెట్టాడు ఓ సౌతాఫ్రికా యువకుడు. ఫ్లకార్డుపై ‘కావ్య మారన్ విల్ యూ మ్యారీ మీ’ అంటూ లవ్ సింబల్‌తో తన ప్రేమను వ్యక్తపరిచాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో.. పాపకు ఫాలోయింగ్ బాగానే పెరిగిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. ఈ లీగ్‌లో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడింటిలో గెలిచిన సన్‌రైజర్స్ 12 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.

 

Show comments