Kavya Maran-Anirudh Wedding: సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ (Kavya Maran), ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) పెళ్లి గ్రీస్‌లో ఘనంగా జరిగింది. నిన్న తమ తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఫొటోలు సైతం పంచుకున్నారు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ, క్రికెట్ ప్రపంచంలోఈ పెళ్లి హాట్ టాపిక్‌గా మారింది. ఈ గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ (Destination Wedding) వేడుకలకు అతిరథ మహారథులు క్యూ కట్టారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin), సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ఈ పెళ్లికి హాజరయ్యారు. నిన్న(నవంబర్ 10) అందమైన శాంటోరిని (Santorini) ద్వీపం సమీపంలో ఈ వివాహ వేడుక కొనసాగింది. అయితే.. అసలు ఈ పెళ్లికి ఎంత ఖర్చు చేశారు? ఈ వివాహం ప్రత్యేకతలు ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం..
ప్రకృతి అందాలు, గొప్ప సంస్కృతి, అద్భుతమైన ఆతిథ్యం కలగలిసిన గ్రీస్.. ప్రపంచంలోనే అత్యుత్తమ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా నిలుస్తోంది. ఇక, గ్రీస్‌లో పెళ్లికి వచ్చిన అథితుల రాకపోకల కోసం మారన్ కుటుంబం ఏకంగా నాలుగు ప్రైవేట్ విమానాలు (Private Aircrafts), లగ్జరీ వసతి, లోకల్ ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లు చేసినట్లు ఓ జాతీయ మీడియా కథనం వెల్లడించింది. ఏ పెళ్లిలోనైనా ఆహారమే ప్రధాన ఆకర్షణ. గ్రీక్ వంటకాల్లో (Greek Cuisine) తాజా కూరగాయలు, సీఫుడ్, నాణ్యమైన మాంసాహారంతో పాటు వెజిటేరియన్ (Vegetarian), వీగన్ (Vegan) ఆహార ప్రియులకు తగ్గట్టుగా ఎన్నో రకాల సంప్రదాయ రుచులు అందుబాటులో ఉంటాయి. వీటికి తోడు స్థానికంగా తయారయ్యే విడియానో (Vidiano), మస్కాటో స్పినాస్ (Moschato Spinas) వంటి వైన్లు (Wines), ఊజో (Ouzo), మస్తిహా (Mastiha) వంటి సంప్రదాయ డ్రింక్స్ వేడుకలకు గ్రీక్ టచ్ ఇస్తాయి. నివేదికల అంచనాల ప్రకారం, ఈ లగ్జరీ వెడ్డింగ్‌లో కేవలం ఒక్క వ్యక్తికి పెట్టే భోజనం లేదా ఒక ప్లేట్ ధర సుమారు రూ. 15,000 నుంచి రూ. 35,000 వరకు ఉంటుందట. ఈ వేడుకకు హాజరైన రాజకీయ, సినీ, క్రీడా దిగ్గజాల ఫుడ్ మెనూ కోసమే కోట్లాది రూపాయలు ఖర్చు చేశారట. ఇక ఈ వెడ్డింగ్‌కు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు పలు కథనాలు చెబుతున్నారు.
అసలు ఇంత మంది సెలబ్రిటీలు, సంపన్నులు తమ జీవితంలోని ముఖ్యమైన వేడుకల కోసం గ్రీస్నే ఎందుకు ఎంచుకుంటున్నారు? అక్కడ అంత ప్రత్యేకత ఏముందో తెలసుకుందాం.. గ్రీస్‌లో ఏడాదిలో దాదాపు 300 రోజుల పాటు ఆహ్లాదకరమైన ఎండ, నిర్మలమైన నీలి ఆకాశం ఉంటాయి. ఈ మధ్యధరా వాతావరణం (Mediterranean Climate) వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా అవుట్డోర్ వెడ్డింగ్స్ (Outdoor Weddings) ప్లాన్ చేసుకోవచ్చు. సముద్రపు ఒడ్డున కొండ అంచున అయినా, పచ్చని ప్రకృతి మధ్య అయినా రిసెప్షన్లకు గ్రీస్ అద్భుతమైన వేదికగా నిలుస్తుంది. ఇక పెళ్లి ఫోటోగ్రఫీ (Wedding Photography) విషయానికొస్తే, ఇది జంటలకే కాదు ఫోటోగ్రాఫర్లకు కూడా ఒక డ్రీమ్ లొకేషన్. పురాతన కట్టడాలు, తెల్లని భవనాలు, అందమైన తీర ప్రాంతాల నేపథ్యంలో తీసే ఫోటోలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ముఖ్యంగా సాయంత్రం వేళ సూర్యాస్తమయపు ‘గోల్డెన్ అవర్’ (Golden Hour) వెలుతురులో ఫోటోలు మరింత మాయాజాలం చేస్తాయి.

