ఇటీవల చిన్న సినిమాగా విడుదలై రికార్డ్స్ బ్రేక్ చేసిన బలగం మూవీ హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్… ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను అందుకుంది.. ఆ సినిమా తర్వాత మరో సినిమాలో నటించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ అందాలతో యువతకు పిచ్చెక్కిస్తుంది.. లేటెస్ట్ ఫోటో షూట్ ఇంస్టాగ్రామ్ ని షేక్ చేస్తుంది. అమ్మడు ఎద అందాల విందు మైమరిపిస్తోంది. కావ్య లోని హాట్ యాంగిల్ అదుర్స్ అంటున్నారు జనాలు.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
కావ్య లేటెస్ట్ మూవీ ఉస్తాద్. కీరవాణి తనయుడు శ్రీసింహ హీరోగా నటించాడు. ఉస్తాద్ మూవీ ఓ డిఫరెన్స్ సబ్జెక్టుతెరకెక్కింది. అయితే ఈ చిత్రం నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో బలగం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కావ్యకు ప్లాప్ పడింది.. చైల్డ్ ఆర్టిస్ట్ గంగోత్రి, బాలు , విజయేంద్ర వర్మ, ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, బన్నీ, పాండురంగడు ఇలా పదికి పైగా చిత్రాల్లో కావ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. మసూద చిత్రంతో కావ్య హీరోయిన్ అయ్యారు.. హారర్ జోనర్లో తెరకెక్కిన మసూద హిట్ టాక్ తెచ్చుకుంది..
అయితే ఆమెకు బలగం ఫేమ్ తెచ్చింది. దర్శకుడు వేణు ఎల్దండి అద్భుతం చేశాడు. 2023 సెన్సేషన్స్ లో ఒకటిగా బలగం నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బంపర్ హిట్ కొట్టింది. ఈ సినిమా సంచనాలు గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రియదర్శికి జంటగా కావ్య కళ్యాణ్ రామ్ నటించింది..ఇటీవల కావ్య కళ్యాణ్ రామ్ పై ఓ రూమర్ చక్కర్లు కొట్టింది. హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో దర్శక నిర్మాతలు బాడీ షేమింగ్ కి పాల్పడ్డారని తాను చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. లావుగా ఉన్నావు, నువ్వు హీరోయిన్ కాలేవని కావ్య స్వయంగా చెప్పారని వార్తలు వచ్చాయి.. వాటికి స్పందించిన అమ్మడు కొట్టిపారేశారు.. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకొనే ప్రయత్నం చేస్తుంది..