Site icon NTV Telugu

Kavya Kalyanram : బలగం భామకు క్రేజీ ఆఫర్..?

Kavya Kalyan Ram

Kavya Kalyan Ram

Kavya Kalyanram : టాలీవుడ్ బ్యూటీ కావ్య కళ్యాణ్ రాం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ భామ చైల్డ్ ఆర్టిస్ట్ ఎన్నో సినిమాలలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈభామ హీరోయిన్ గా వరుస సినిమాలలో నటించి మెప్పిస్తుంది..స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో దర్శకుడు వేణు తెరకెక్కించిన బలగం సినిమాలో కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా భారీ సక్సెస్ సాధించింది.అలాగే ఈ అమ్మడు రీసెంట్ గా సింహా కోడూరి హీరోగా నటించిన ఉస్తాద్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.ప్రస్తుతం ఈ భామ అవకాశం కోసం ఎదురు చూస్తుంది.తాజాగా హాట్ ఫోటోషూట్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.

Read Also :Pushpa 2 : భారీ యాక్షన్ సీక్వెన్స్ తో పుష్ప 2 ఇంటర్వెల్ సీన్..?

ఇదిలా ఉంటే ఈ భామకు క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది.మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ సినిమాలో ఈ భామకు హీరోయిన్ గా ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది.నూతన దర్శకుడు రోహిత్ డైరెక్షన్ లో సాయి దుర్గ తేజ్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాను హనుమాన్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు “సంబరాల ఏటి గట్టు” టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.. ఈ ఆఫర్ కావ్య కెరీర్ కు బాగా ఉపయోగపడుతుంది అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.ఈ సినిమా హిట్ అయితే ఈ భామకు వరుస ఆఫర్స్ వచ్చే అవకాశం వుంది.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని సమాచారం.

Exit mobile version