NTV Telugu Site icon

Kavitha: కాసేపట్లో తీహార్ జైలు నుంచి కవిత విడుదల..

Kavitha

Kavitha

కాసేపట్లో తీహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదల కానుంది. లిక్కర్ కేసులో కవితకు ట్రయల్ కోర్టు రిలీజ్ వారెంట్ ఇచ్చింది. కవిత భర్త, బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర అందించిన షూరిటీ బాండ్లను స్వీకరించి కవితను విడుదల చేయాలని వారెంట్ ఇచ్చింది. కాగా.. కవిత విడుదలకు ప్రాసెస్ జరుగుతుంది. జైలు నుంచి విడుదలైన తర్వాత ఈ రాత్రికి ఢిల్లీలోనే ఉండనున్నారు కవిత, కేటీఆర్, హరీష్ రావు. తీహార్ జైలు నుంచి నేరుగా ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు. రేపు సీబీఐ ఛార్జీషీట్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరుగనుంది. ఆ విచారణకు కవిత ఆన్ లైన్లో హాజరుకానున్నారు. అనంతరం.. హైదరాబాద్ కు రానున్నారు.

Read Also: Kolkata Doctor Murder: ‘రేపు బంద్ లేదు.. అందరూ ఆఫీసుకు రావాల్సిందే’.. ప్రభుత్వం అల్టిమేటం

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ సీబీఐ, ఈడీ కేసుల్లో కవితకు బెయిల్‌ మంజూరు చేసింది ధర్మాసనం. పలు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. రూ.10 లక్షల విలువైన 2 షూరిటీలు సమర్పించాలని సుప్రీం ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని తెలిపింది. కవిత పాస్‌పోస్ట్‌ ను అప్పగించాలని సుప్రీంకోర్టు తెలిపింది. కవిత బెయిల్‌ కు 3 ప్రధాన కారణాలు సుప్రీం కోర్టు తెలిపింది. మహిళకు ఉండే హక్కులను కూడా పరిగణించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది. సీబీఐ తుది ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిందని, ఈడీ ఛార్జ్‌ షీట్‌ వేయలేదని తెలిపింది. ఇక ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో 166 రోజులు కవిత తిహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.

Read Also: Himanta Biswa Sarma: అస్సాంని ముస్లింలు ఆక్రమించుకోనివ్వను..