బాలివుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించంది.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది.. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా చీరకట్టులో దర్శనమిచ్చింది. బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేస్తోంది. అయితే కొన్నాళ్లుగా తను ఆ ఒక్క విషయంలో కట్టుబడి ఉంటున్నట్టు కనిపిస్తోంది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ప్రస్తుతం సినిమాల జోరును తగ్గించింది. తన సైన్ చేసిన సినిమాల్లో మాత్రం నటిస్తూ వస్తోంది. చివరిగా ఈ ముద్దుగుమ్మ ‘టైగర్ 3’ చిత్రంతో అలరించింది.. ఇప్పుడు మరో సినిమాలో నటిస్తుంది.. అయితే, ఈ ముద్దుగుమ్మ మునుపటి లాగా వెండితెరపై గ్లామర్ ఒళకబోసేందుకు సిద్ధంగా లేదు. తన పాత్ర చాలా కీలకమై, విభిన్నంగా ఉంటేనే నటించేందుకు ఒప్పుకుంటోంది.. యాక్షన్ సినిమాలలో ఎక్కువగా నటిస్తుంది..
రెండేళ్ల కింద 2021లో డిసెంబర్ 9న వివాహం జరిగింది. పెళ్లి తర్వాత భర్తతో కలిసి జోరుగా గ్లామర్ పిక్స్ షేర్ చేసింది.. ఇటీవల కొన్ని పోస్టులను పెడుతుంది.. ఆ పోస్టులు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి.. గ్లామర్ ట్రీట్ కు తెర దించేసింది. ఎలాంటి సినీ ఫంక్షన్లు అయినా, ట్రెడిషనల్ ఈవెంట్స్ కైనా ఈ ముద్దుగుమ్మ చాలా పద్ధతిగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ సంప్రదాయంగానే కనిపిస్తూ తన అభిమానులను ఆకట్టుకుంటోంది.. ఈ సందర్భంగా ఆమె తరుచుగా పంచుకుంటున్న బ్యూటీఫుల్ శారీ ఫొటోస్ ను నెట్టింట వైరల్ చేస్తున్నారు. సంప్రదాయ దుస్తుల్లో ఎంత ముద్దుగా ఉందో అంటూ పొగుడుతున్నారు.. తాజాగా షేర్ చేసిన బ్లాక్ శారీలో బ్యూటిఫుల్ గా మెరిసింది.. ఇక మెరీ క్రిస్టమస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది..