టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి (78) కన్నుమూశారు. శనివారం రాత్రి చైన్నైలోని తన నివాసంలో కాట్రగడ్డ మురారి మృతి చెందారు. అయితే.. ఆయన గోరింటాకు సహా పలు చిత్రాలు నిర్మించారు. యువచిత్ర ఆర్ట్స్ పేరుతో పలు సినిమాలను కాట్రగడ్డ నిర్మించారు. విజయవాడ, మొగల్రాజపురంలో 1944 వ సంవత్సరంలో జన్మించాడు కాట్రగడ్డ మురారి. వరంగల్లు, ఆ తర్వాత హైదరాబాదులలో ఎంబీబీఎస్ చదువుతూ మధ్యలో ఆపి మద్రాసు వెళ్లి సినిమా రంగంలో ప్రవేశించాడు. మురారి మొదటగా కొన్ని సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేసి తర్వాత యువచిత్ర ఆర్ట్స్ అనే సంస్థను స్థాపించి సినిమాలు నిర్మించాడు.
Also Read : రమ్యకృష్ణను చూసారా.. రోజురోజుకు మరింత మత్తెక్కిస్తోంది..
తన సినిమాల్లో సంగీతానికి ప్రాముఖ్యం ఇచ్చేవాడు. ఆయన నిర్మించిన సినిమాల్లో ఎక్కువగా కె. వి. మహదేవన్ స్వరపరిచినవే. అయితే.. 2012లో ఆయన ఆత్మకథ నవ్విపోదురు గాక అనే పుస్తక రూపంలో విడుదల చేశారు. ఈ పుస్తకంలో కొందరు సినీ ప్రముఖులపై విమర్శలు చేశాడు కాట్రగడ్డ. అయితే.. ఆయన.. సీతామాలక్ష్మి, గోరింటాకు, జేగంటలు, త్రిశూలం, అభిమన్యుడు, సీతారామ కల్యాణం, శ్రీనివాస కళ్యాణం, జానకిరాముడు, నారీ నారీ నడుమ మురారి సినిమాలను నిర్మించారు.