Site icon NTV Telugu

Kate middletons: మళ్లీ వివాదంలో కేట్ మిడిల్టన్ తాజా ఫొటో

Mideleten

Mideleten

కేట్ మిడిల్టన్‌కు సంబంధించిన మరో ఫొటో విమర్శల పాలైంది. గతంలో ఆమె మదర్స్ డే సందర్భంగా పిల్లలతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది నకిలీ ఫొటో అంటూ నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో జరిగిన పొరపాటును అధికారికంగా అంగీకరించి క్షమాపణ చెప్పారు. తాజాగా కేట్ మిడిల్టన్‌కు చెందిన మరో ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ఫొటో కూడా మార్ఫింగ్ ఫొటో అంటూ నెటిజన్లు విమర్శిస్తు్న్నారు. దీనిపై బ్రిటన్ రాజు కుటుంబం ఎలా స్పందిస్తుందో చూడాలి.

బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌ పెద్ద కోడలు, ప్రి‍న్స్‌ విలియమ్‌ సతీమణి.. వేల్స్‌ యువరాణి కేట్‌ మిడిల్టన్‌ చాలా రోజులు బాహ్య ప్రపంచానికి కనిపించలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యాయి. యువరాణి ఏమయ్యారంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. కొద్ది రోజులకు మదర్స్ డే సందర్భంగా పిల్లలతో ఉన్న కేట్ మిడిల్టన్ ఫొటో రిలీజ్ చేశారు. ఇది నకిలీ ఫొటో అంటూ విమర్శలు రావడంతో తప్పు ఒప్పుకుని క్షమాపణలు చెప్పారు. ఇక అనంతరం ఆమె ఆరోగ్యంపై అధికారిక ప్రకటన వచ్చింది. కేట్ మిడిల్టన్ కేన్సర్‌తో బాధపడుతున్నారని.. శస్త్ర చికిత్స జరిగిందని.. కోలుకుని త్వరలో వస్తారని ప్రకటన వచ్చింది. కేన్సర్ ప్రకటన వెలువడిన ఇన్నాళ్లకు కేట్ మిడిల్టన్‌కు చెందిన మరో ఫొటు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అందులో ఓ చెట్టు దగ్గర నిలబడినట్లుగా ఉన్న చిత్రాన్ని విడుదల చేశారు. ఇప్పుడు ఇది కూడా మార్ఫింగ్ ఫొటో అంటూ విమర్శలు వస్తున్నాయి. మరి దీనిపై రాజు కుటుంబం ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇది కూడా చదవండి: Prasanth Neel : ఊరు పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న డైరెక్టర్.. ఎందుకో తెలుసా?

 

https://twitter.com/IdahoPOTato71/status/1801689563104219171

Exit mobile version