Site icon NTV Telugu

Vijayawada: కుదేలవుతున్న కశ్మీర్ ట్రావెల్స్.. అమర్‌నాథ్ యాత్రికులు సైతం వెనకడుగు..

Pahalgam

Pahalgam

కశ్మీర్ ట్రావెల్స్ కుదేలవుతుంది. పహల్గావ్ ఘటనతో టూరిస్టులు వెనక్కి తగ్గుతున్నారు. చావు కంటే వేసవి తాపం బెటర్ అంటున్నారు పర్యటకులు. కశ్మీర్ హోటళ్ళ నుంచి ఫ్యూచర్ క్రెడిట్ అవకాశాలు ఇచ్చాయి. ఇప్పుడు బుక్ చేసుకున్నవి వచ్చే సీజన్ వరకూ రిజర్వులో ఉంచుకునే అవకాశం కల్పించాయి. విమాన టికెట్లు రద్దు చేసుకుంటే మొత్తం సొమ్ము తిరిగి ఇచ్చేస్తున్నాయి విమానయాన సంస్థలు. విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చేసిన ఏర్పాటుతో టూరిస్టులకు ఊరట లభించింది. ప్రత్యేక ఆఫర్లు ఇచ్చినా నై అంటున్నారు పర్యటకులు. మరో మూడు నెలల వరకూ కశ్మీర్ టూర్ లు డౌటే అంటున్నారు. అమర్‌నాథ్ యాత్రికులు సైతం వెనకడుగు వేస్తున్నారు.

READ MORE: Vijayawada: ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిలను ట్రాప్ చేసి.. డబ్బు, బంగారం కాజేసిన కిలాడీ అరెస్ట్..

ఇదిలా ఉండగా.. పహల్గాం ఘటనలో ఏపీకి చెందిన చంద్రమౌళి మృతి చెందారు. బుధవారం (ఏప్రిల్ 23) రాత్రి చంద్రమౌళి మృత దేహానికి విశాఖ ఎయిర్ పోర్టులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. గురువారం పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చంద్రమౌళి ఇంటికి వచ్చి ఆయనకు నివాళులు అర్పించి చంద్రమౌళి భార్యను పరామర్శించారు. చంద్రమౌళి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా అందజేసింది. విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి చంద్రమౌళి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల చెక్కును అందజేశారు.

READ MORE: NTR, Neel : నక్క తోక తొక్కిన మమిత బైజు.. భారీ ఆఫర్ కొట్టేసింది‌గా !

Exit mobile version