కార్వీ కేసు లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో హైకోర్టు ను ఆశ్రయించారు కార్వీ ఎండి పార్థసారథి. బెంగుళూరు పోలీసుల పిటి వారెంట్ ను సవాలు చేస్తూ హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేశారు పార్థసారథి. అనారోగ్య కారణల వలన బెంగుళూరు పోలీసుల విచారణ కు సహాకరించలేనని హైకోర్టు కు తెలిపారు కార్వి ఎండి పార్థసారథి. ఈ నేపథ్యంలోనే బెంగుళూరు పోలీసులకు ఇచ్చిన పిటి వారెంట్ ను రద్దు చేసింది హైకోర్టు. ఇక ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్నారు కార్వీ ఎండి పార్థసారథి. ఇక అటు కార్వీ కేసులో దూకుడు పెంచిన ఈడీ.. కార్వీ సంస్థల పైన విస్తృతంగా సోదాలు చేస్తున్నది. 16 చోట్ల కార్వీ సంస్థ ల పై సోదాలు చేస్తున్న ఈడీ..
హైదరాబాద్ లోని కార్వీ దానికి సంబంధించిన పది అనుబంధ సంస్థల్లో సోదాలు చేస్తోంది. హైదరాబాద్ లోని ప్రధాన కార్యాలయంతో పాటు బెంగళూరు, చెన్నై ,ముంబై, ఢిల్లీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తోంది ఈడీ.
కార్వి కేసు : హైకోర్టు ను ఆశ్రయించిన ఎండీ పార్థసారథి
