Karur Stampede at Vijay’s TVK Rally: తమిళనాడులోని కరూర్‌లో నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ పార్టీ టీవీకే ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 16 మంది మహిళలు, 10 మంది పిల్లలు సైతం ఉన్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం వివిధ ఆసుపత్రుల్లో చేర్చారు. ఇంతలో తొక్కిసలాట గురించి ముఖ్యమైన సమాచారం వెలువడుతోంది. ర్యాలీలో జనం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉన్నారని తెలిసింది. విజయ్ షెడ్యూల్ చేసిన సమయం కంటే ఆలస్యంగా వచ్చారు. మండుతున్న వేడిలో ఎక్కువసేపు నిలబడటం వల్ల కొంతమంది అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయారని తెలుస్తోంది. దీంతో మిగతా వాళ్లు సైతం భయాందోళనకు గురై తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యేక్ష సాక్షులు చెబుతున్నారు.
READ MORE: Thaman : నేను చరణ్ ని ఏమీ అనలేదు.. మేం బానే ఉన్నాం.. కానీ ఫ్యాన్స్ ఏ రచ్చ చేశారు!
కరూర్ తొక్కిసలాటపై తమిళనాడు తాత్కాలిక డీజీపీ జి. వెంకటరామన్ ఇప్పటికే స్పందించారు. ర్యాలీకి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతి మంజూరు చేయగా, ఉదయం 11 గంటల నుంచే జనం గుమిగూడడం ప్రారంభించారు. విజయ్ సాయంత్రం 7:40 గంటలకు వచ్చేసరికి, జనం ఆకలి, దాహంతో అలమటించారని చెప్పారు. “పోలీసుగా తీసుకోవాల్సిన చర్యలను మేము తీసుకున్నాం. గతంలో, టీవీకే ర్యాలీలకు తక్కువ మంది వచ్చేవారు. కానీ ఈసారి ఊహించిన దానికంటే ఎక్కువ మంది హాజరయ్యారు. నిర్వాహకులు 10,000 మంది వస్తారని ఆశించినప్పటికీ, దాదాపు 27,000 మంది గుమిగూడారు. విజయ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాల్సిన ప్రచార వేదిక వద్ద 500 మందికి పైగా పోలీసు అధికారులను మోహరించాం.” అని తెలిపారు.
READ MORE:Maharastra: మహారాష్ట్రలో భయంకర రోడ్డు ప్రమాదం, పుణే-సోలాపూర్ జాతీయ రహదారిపై విషాదం
మరోవైపు.. ఈ అంశంపై ప్రత్యక్ష సాక్షి నంద కుమార్ ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. “ఘటన జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను. విజయ్ ఉదయం 11 గంటలకు రావాల్సి ఉంది. కానీ అతను చాలా ఆలస్యంగా వచ్చాడు. పిల్లలతో వచ్చిన ప్రజలు ఆకలి, దాహంతో అలమటించారు. విజయ్‌ను చూడటానికి గంటల తరబడి నిలబడ్డారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. నిర్వాహకులకు జనసమూహం గురించి అంచనా వేయలేదు. ఎలాంటి ఏర్పాట్లు చేయాలేదు.” అని స్పష్టం చేశారు. అక్కడున్న మిగతా సాక్షులు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు.
