Karur Stampede: కరూర్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 10 మంది పిల్లలు సహా 40 మంది మృతి చెందారు. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్‌ను ఆశ్రయిస్తామని నటుడు-రాజకీయ నాయకుడు విజయ్‌కు చెందిన తమిళగ వెట్రీ కజగం (టీవీకే) ఆదివారం తెలిపింది. ఈ విషాదం ప్రమాదవశాత్తు జరిగినది కాదని, కుట్ర ఫలితమని ఆ పార్టీ ఆరోపించింది. జనంలో రాళ్ల దాడి, వేదికపై పోలీసుల లాఠీచార్జిని ఎత్తి చూపింది. ఇదిలా ఉండగా, కరూర్ తొక్కిసలాటపై విచారణ పూర్తయ్యే వరకు నటుడు విజయ్ టీవీకే ఎలాంటి బహిరంగ సభలు నిర్వహించకుండా నిషేధించాలని కోరుతూ దాఖలైన అత్యవసర పిటిషన్‌ను జస్టిస్ ఎన్ సెంథిల్‌కుమార్ ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు విచారిస్తారని మీడియా వర్గాలు తెలిపాయి.
READ MORE: India-China: ఇండియాకు చైనా గుడ్ న్యూస్.. ఫార్మా దిగుమతులపై ‘‘జీరో’’ సుంకం..!
అయితే.. ఈ తొక్కిసలాట ఘటనపై తాజాగా కరూర్ జిల్లా కలెక్టర్ ఎం. తంగవేల్ స్పందించారు. ఆయన మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 40కి చేరినట్లు తెలిపారు. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలతో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 40 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. బాధిత కుటుంబాల రోదనలతో జిల్లా శోక సంద్రంలో మునిగిపోయింది. గాయపడిన బాధితుల కుటుంబాలు ఆసుపత్రి వద్ద పడిగాపులుగాస్తున్నారు. అందరూ సురక్షితంగా ఆసుపత్రి నుంచి డిష్చార్జ్ కావాలని కోరుకుంటున్నారు.
