తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు, దళపతి విజయ్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రచార సభ సమయంలో టీవీకే పార్టీనే పవర్ కట్ చేయమందని తమిళనాడు విద్యుత్తు బోర్డు అంటోంది. తమ పార్టీ అధినేత విజయ్ ర్యాలీ సందర్భంగా తాత్కాలికంగా విద్యుత్తు సరఫరా ఆపేయాలని టీవీకే వినతిపత్రం ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. తమకు లేఖ ఇచ్చినట్లుగా విద్యుత్తు బోర్డు చీఫ్ ఇంజినీర్ రాజ్యలక్ష్మి ధ్రువీకరించారు.
తాత్కాలికంగా విద్యుత్తు సరఫరా ఆపేయాలని తమకు టీవీకే పార్టీ నేతలు లేఖ ఇచ్చినట్లు విద్యుత్తు బోర్డు చీఫ్ ఇంజినీర్ రాజ్యలక్ష్మి వెల్లడించారు. విద్యుత్ నిలిపివేయడంపై తమకేం సంబంధం లేదని, విద్యుత్తు బోర్డు అధికారులు కావాలనే సరఫరా నిలిపివేశారని టీవీకే ఆరోపణలు చేస్తోంది. కరూర్‌లో విజయ్ ప్రచార సభలో పవర్ కట్ జరగడంతోనే తొక్కిసలాట జరిగినట్లు టీవీకే ఆరోపణలు చేస్తోంది. మరి ఇందులో ఎవరి చెప్పేది నిజమో తెలియక విజయ్ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.
Also Read: Antarvedi Beach: 500 మీటర్లు లోపలికి వెళ్లిన అంతర్వేది బీచ్.. సునామీకి సంకేతమా?
ఇక కరూర్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోజు ఒకరు చనిపోయారు. విజయ్ ప్రచార సభలో శనివారం తొక్కిసలాట జరిగింది. పలు ఆసుపత్రుల్లో 80 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. అందులో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీవీకే నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. హీరో విజయ్‌ను కూడా అరెస్టు చేయవచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. చెన్నైలోని నీలాంగరైలోని విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు ఆదివారం రాత్రి రాష్ట్ర డీజీపీ ఆఫీసుకు గుర్తుతెలియని వ్యక్తులు ఈ–మెయిల్ చేశారు. తనిఖీలు చేయగా.. ఇంట్లో పేలుడు పదార్థాలు ఏమీ లభించలేదు. విజయ్ నివాసం వద్ద పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
