NTV Telugu Site icon

Kartikeya : చిరంజీవి గారి పై విమర్శలు చేసే వారిది చిన్న మనస్తత్వం..

Whatsapp Image 2023 08 19 At 2.37.59 Pm

Whatsapp Image 2023 08 19 At 2.37.59 Pm

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆర్ ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ యంగ్ హీరో ఆ సినిమాతో అద్భుత విజయం సాధించి బాగా పాపులర్ అయ్యాడు. తాను తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ కూడా భారీగా ఫాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కార్తికేయ.కార్తికేయ తాజాగా నటించిన చిత్రం బెదురులంక 2012. ఈ సినిమా ఆగస్టు 25 న ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ని స్పీడ్ అప్ చేసింది. ఇది ఇలా ఉంటే ఈ ప్రమోషన్స్ లో భాగంగా యంగ్ హీరో కార్తికేయ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూ లో మెగా స్టార్ చిరంజీవి పై వస్తున్న విమర్శల పై స్పందించారు.

రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా తాజాగా విడుదల అయి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో దర్శకుడు మెహర్ రమేష్ పై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. అలాగే హీరో చిరంజీవి పై కూడా తీవ్రంగా నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.హీరో కార్తికేయ ఆ నెగిటివ్ కామెంట్స్ పై తాజాగా స్పందించారు… ఒక సినిమా బాగోలేదు, నచ్చలేదు అని అనడంలో ఎవరికి కూడా అంత ఇబ్బంది ఉండదు. కాని అలా కాకుండా ఒక వ్యక్తిని పర్సనల్ గా టార్గెట్‌ చేస్తూ నెగటివ్ కామెంట్స్ చేయడం బాధ గా అనిపిస్తుంది. ఆయన్ని అలా అనేవారిని చూస్తుంటే వారిది చిన్న మనస్తత్వం ఏమో అని నాకు అనిపిస్తుంది.ఒక్క చిరంజీవి గారినే కాదు, అలా ఏ నటుడిని అనడం మంచి పద్ధతి కాదు.. చిరంజీవి గారు తన కెరీర్ లో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి ఎదిగారు. ఆయన ఎంతో మంచి మనస్తత్వం కలవాడు.అలాంటి వ్యక్తి పై ఇలా నెగటివ్ కామెంట్స్ చేయడం తప్పు.. ఇప్పటికైనా వాటిని ఆపండి అని కార్తికేయ చెప్పుకొచ్చారు. ఈ సందర్బంగా కార్తికేయ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి