NTV Telugu Site icon

Karthika Masam : కార్తీకమాసంలో ఈ ఆహారాలను తినకూడదు

Karthika Masam

Karthika Masam

కార్తీక మాసం అనగానే దీపారాధన, నదీ స్నానాలు, వనభోజనాలు గుర్తుకొచ్చి తీరుతాయి. వీటితో పాటుగా మరికొన్ని నియమాలు లేకపోలేదు. అందులో ఆహారానికి సంబంధించి నియమం ముఖ్యమైనది. మనం తీసుకొనే ఆహారం మన ఆలోచనలు కూడా ప్రభావితం చేస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకే పరమ పవిత్రమైన కార్తీకమాసంలో అని ఆహారం కూడా అంతే పవిత్రంగా ఉండాలి అనేది పెద్దల ఆలోచన. దానికోసం అపరిశుభ్రమైన వాతావరణంలో ఉండిన ఆహారం తినకూడదు అని సూచించారు. అంటే నెలంతా కూడా స్నానం చేసి మాత్రమే వంట చేయాలంట.
Also Read : Koti Deepotsavam Day 1 : సహస్ర కలశాభిషేకం, కోటిమల్లెల అర్చన, కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వర కల్యాణం

అలాగే రెండోసారి వెచ్చ చేసిన ఆహారం, మాడిపోయిన పదార్థాలు, ఉదయం వండిన ఆహారాన్ని సాయంత్రం వేళ తినటం ఇలాంటివన్నీ ఈ కార్తీకమాసంలో చెయ్యకూడదు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప కార్తీకమాసంలో బయట భోజనం చేయకూడదు అనేది పెద్దల మాట. ఎందుకంటే ఆహారాన్ని వండే వారి మనస్తత్వం కూడా ఆయా పదార్ధాల మీద ప్రతిఫలిస్తుంది అని చెప్తారు. అందుకే కార్తీకమాసంలో పరాయి ఇళ్లలో ఆహారం తినడాన్ని నిషేధించారు. ఇక కార్తీక సంవత్సరంలో వచ్చే పౌర్ణమి, అమావాస్య ఆదివారాన్ని నిషిద్ధ తినాలని కార్తీక పురాణం పేర్కొంటుంది. ఈ రోజులలో రాత్రివేళ భోజనం చేయకూడదు అని హెచ్చరిస్తుంది. కార్తీక ఏకాదశి తిధుల్లో అయితే రెండు పూటలా భోజనం చేయకపోవడం ఉత్తమం అని చెప్తారు. అంటే పూర్తిగా ఉపవాసం ఉండాలి. విష్ణుమూర్తి ఆషాడమాసంలోని సైనా ఏకాదశినాడు యోగ నిద్రకు ఉపక్రమిస్తారంట.

అలా నిద్రించిన స్వామి కార్తీక మాసంలో వచ్చే ఉత్తాన ఏకాదశినాడు మేలు కొంటారు. ఈ నాలుగు నెలలని చాతుర్మాస్యం అని పిలుస్తారు. యతుల దగ్గర నుంచి సామాన్యులు వరకు ఈ నాలుగు నెలలు రక రకాల ఆహార నియమాలని పాటిస్తారు. వాటిలో భాగంగా కార్తీకమాసంలో ద్విదళ ధ్యానాలు తినకూడదు అని చెప్తారు. అంటే బద్దలు గా వచ్చే కందులు, మినుములు, పెసలు, శెనగలు వంటి పప్పు ధాన్యాలు అన్నమాట. వీటిని ఈ కార్తీకమాసంలో తినకూడదు. కార్తీకమాసంలో దైవారాధన కు ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకని సందర్భంలో మనసుని ప్రభావితం చేసే ఉల్లి, ఇంగువ, మునగాకు, ముల్లంగి ఇలాంటి పదార్థాలకు కూడా కాస్త దూరంగా ఉండమని చెప్తారు పెద్దలు.

ఇక కార్తీక మాసపు చలికి తోడుగా అనారోగ్యాలు అందించి ఆనపకాయ, పుచ్చకాయ, పుట్టగొడుగులు, గుమ్మడికాయ వంటి పదార్థాలను కూడా విసర్జించాలి సూచిస్తున్నారు. కార్తీకమాసంలో ఇలాంటి ఆహార నియమాలు కనక పాటిస్తే అటు ఆరోగ్యము, ఇటు ఆలోచన దృఢంగా ఉంటాయనేది తరతరాల నమ్మకం. కాబట్టి కార్తీక మాసంలో మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలో మన పెద్దలు సూచించిన దానికి అనుగుణంగా మనం ఆహార నియమాలు పాటిస్తే అటు భక్తి, ఇటు ఆరోగ్యం రెండు మన సొంతం అవుతాయి.