Lingoccha : ఓటీటీలోకి వచ్చేసిన కార్తీక్ రత్నం ‘లింగొచ్చా’ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ రత్నం.. కేరాఫ్ కంచరపాలెం మరియు నారప్ప సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఓ వైపు హీరోగా నటిస్తూనే పలు సినిమాలలో ప్రత్యేక పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నాడు. కార్తీక్ రత్నం నటించిన లేటెస్ట్ చిత్రం లింగొచ్చా. ఆనంద్ బడా తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రంలో సుప్యర్దీ సింగ్ హీరోయిన్గా నటించింది.. బల్వీర్ సింగ్, కునాల్ కౌశిక్, తాగుబోతు రమేశ్ మరియు ఉత్తేజ్ వంటి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దసరా కానుక గా అక్టోబర్ 27న థియేటర్లలో రిలీజైన లింగొచ్చా మూవీ యావరేజ్‌గా నిలిచింది. అప్పటికే బరిలో పెద్ద సినిమాలు ఉండడంతో ఈ సినిమాకు మోస్తరు కలెక్షన్లు మాత్రమే వచ్చాయి.. అయితే ఈ సినిమా హైదరాబాద్ పాత బస్తీ నేపథ్యంలో తెరకెక్కడం అలాగే హిందూ- ముస్లిం ప్రేమకథ కావడంతో ఈ సినిమా యూత్ ను బాగానే ఆకట్టుకుంది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన లింగోచ్చా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా ‘లింగొచ్చా’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో ఆహా సంక్రాంతి పండగ కానుకగా లింగొచ్చా ను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొచ్చింది.లింగొచ్చా సినిమాలో చాలా మంది కొత్త వాళ్లే నటించడం విశేషం. . లింగొచ్చా కు యాదగిరి రాజు నిర్మాతగా వ్యవహరించగా బికాజ్ రాజ్ సంగీతం అందించారు. ఇక కథ విషయానికొస్తే.. హైదరాబాద్ పాత బస్తీ నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ లవ్ స్టోరీ ఇది. శివ (కార్తీక్ రత్నం), ముస్లిం అమ్మాయి నూర్జహాన్ (సుప్యార్ధీ సింగ్) చిన్నప్పటి నుంచి ఇష్టపడుతుంటారు.. అయితే కొన్ని కారణాలతో నూర్ దుబాయికి వెళ్లిపోతుంది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ తిరిగి ఇండియా కు వస్తుంది. దీంతో శివ, నూర్జహాన్ల ప్రేమ మళ్లీ మొదలవుతుంది.. అయితే నూర్ కుటుంబ సభ్యులను ఎదుర్కొని శివ తన ప్రేమ ను ఎలా గెలిపించుకున్నాడనేదే ఈ చిత్ర కథ..
Also Read
- స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
- Telangana Liquor Shop Scam: "పేరు దళితులది.. దందా సిండికేట్లది".. లిక్కర్ షాపుల్లో బినామీల గుట్టురట్టు
- S*uicide: తండ్రి దినకర్మ రోజే తనయుడు ఆత్మహత్య.!
- CM Revanth Reddy: "ఏ సమస్య వచ్చినా కలెక్టర్లదే బాధ్యత".. ధాన్యం కొనుగోళ్లపై సీఎం కీలక ఆదేశాలు..
- Tags
- #lingochha
- OTT
- Streaming
తాజావార్తలు
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
IPL Playoffs Scenarios: ప్లేఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరం.. ఆర్ఆర్ కంటే సీఎస్కేకు ఛాన్సెస్.. ఆ 3 జట్లకు మాత్రం!
-
Telangana Liquor Shop Scam: “పేరు దళితులది.. దందా సిండికేట్లది”.. లిక్కర్ షాపుల్లో బినామీల గుట్టురట్టు
-
S*uicide: తండ్రి దినకర్మ రోజే తనయుడు ఆత్మహత్య.!
-
CM Revanth Reddy: “ఏ సమస్య వచ్చినా కలెక్టర్లదే బాధ్యత”.. ధాన్యం కొనుగోళ్లపై సీఎం కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..