Site icon NTV Telugu

Karthik Gattamneni : తేజ సజ్జాతో సినిమా చేయబోతున్న ‘ఈగల్’ దర్శకుడు..

Whatsapp Image 2024 02 10 At 9.14.57 Am

Whatsapp Image 2024 02 10 At 9.14.57 Am

మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్.ఈ మూవీలో రవితేజ సరసన కావ్య థాపర్ మరియు అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్‌గా నటించారు.అలాగే హీరో నవదీప్ కీలక పాత్ర పోషించాడు. ఈగల్ మూవీకి యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. తెలుగులోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో ఈగల్ సినిమాను నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు.ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేలకు రవితేజ ఈగల్ మూవీ శుక్రవారం (ఫిబ్రవరి 9) న థియేటర్లలో విడుదలైంది. ఇందులో రవితేజ యాక్షన్ విధ్వంసం చూపించారని నెటిజన్స్ మరియు ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్నడూ చూడని విధంగా మాస్ మహారాజాను చూసినట్లుగా వారు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఈగల్ సినిమా విశేషాలను పంచుకున్నారు. దీంతో ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

“ఈగల్ (గద్ద) నాలుగు కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కూడా కిందున్న రాబిట్‌ని చూడగలదు. ఇందులో హీరోకి ఆ ఐ పవర్ ఉంది. అలాగే ఈ పాత్రకు సినిమాలో కోడ్ నేమ్ కూడా ఈగల్. హిందీలో కూడా ఈ పేరు పెట్టడానికి ప్రయత్నించాం. ఇదే పేరుతో అక్కడ ఓ సినిమా ఉంది. దీంతో ఈ కథలో హీరో పేరు ‘సహదేవ్ వర్మ’ టైటిల్ తో హిందీలో విడుదల చేశాం. నాకు స్టొరీ టెల్లింగ్ అంటే చాలా ఇష్టం. అయితే డీవోపీ యాక్సిడెంటల్‌గా జరిగిపోయింది. దాన్ని ఒక బ్లెస్సింగ్‌గానే భావిస్తాను” అని డైరెక్టర్ కార్తీక్ తెలిపాడు.”ఈగల్ మూవీ సౌండ్ డిజైన్ ఆరు నెలలు చేశాం. అన్ని రియల్‌గా ప్రోడ్యుస్ చేశాం. యూరప్‌లో రియల్ గన్స్‌తో షూట్ చేసి ఆ సౌండ్‌ని రికార్డ్ చేశాం. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. మంచి థియేటర్‌లో చూస్తే ఆ ఎక్స్‌పీరియన్స్‌ని ఫీల్ అవ్వొచ్చు. అని ఈగల్ డైరెక్టర్ కార్తీక్ చెప్పుకొచ్చాడు. నిర్మాత విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి నా కృతజ్ఞతలు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నాకు హోం బ్యానర్‌లా అయిపోయింది. సినిమాకి కావాల్సిన ప్రతిది ఒక్క ఫోన్ కాల్‌తో మాకు సమకూర్చుతారు అని చెప్పుకొచ్చారు.ఇక హనుమాన్ హీరో తేజ సజ్జాతో ఓ సినిమా చేస్తున్నాను. త్వరలోనే ఆ సినిమా గురించి తెలియజేస్తాం” అని డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ గురించి వెల్లడించాడు.

Exit mobile version