Site icon NTV Telugu

Va Vathiyar’: కార్తి ‘వా వాతియార్’ ట్రైలర్ ఔట్!

Annagarru Vastaru

Annagarru Vastaru

విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే కోలీవుడ్ స్టార్ మీరోలో కార్తి ఒకరు. తమిళ హీరో అయినప్పటికి.. ‘యుగానికి ఒక్కడు’, ‘ఆవారా’, ‘ఖైదీ’, ‘సుల్తాన్’, ‘ఊపిరి’ వంటి చిత్రాల ద్వారా తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. ఇక తాజాగా ఆయన ‘వా వాతియార్’ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హీరోయిన్‌గా గ్లామరస్ బ్యూటీ కృతిశెట్టి నటిస్తున్న ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు అందుకున్న నలన్‌ కుమారస్వామి దర్శకత్వం వహించారు. పూర్తి స్థాయి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

Also Read : Bigg Boss 9: హీటెక్కిన ఫినాలే రేస్.. డబుల్ ఎలిమినేషన్‌లో రీతూ ఔట్?

తమిళంలో ‘వా వాతియార్’ పేరుతో విడుదలవుతున్న ఈ చిత్రం, తెలుగు ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ‘అన్నగారు వస్తారు’ అనే టైటిల్‌తో విడుదల కానుంది. ఇక సినిమా విడుదలకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో, సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తూ చిత్ర బృందం తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. సాలిడ్ యాక్షన్, ఆసక్తికరమైన కథాంశంతో ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం డిసెంబర్‌ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా ట్రైలర్ చూస్తుంటే కార్తి అభిమానులకు ఈ సినిమా పండగలాంటి వినోదాన్ని అందించడం ఖాయంగా కనిపిస్తోంది.

 

Exit mobile version