కర్ణాటకలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కర్ణాటకలోని యాద్గిర్ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని పాఠశాల వాష్‌రూమ్‌లో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక, శిశువు ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బందిపై సుమోటో కేసు నమోదు చేసి దర్యాప్తునకు ఆదేశించారు ఉన్నతాధికారులు.
ఈ విషయంపై కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుుడు శశిధర్ కోసాంబే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగుతుంటే పాఠశాల సిబ్బంది ఏం చేస్తుందని ప్రశ్నించారు. వెంటనే దీనిపై నివేధిక పంపాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులు ఈ విషయాన్ని కమిషన్ దృష్టికి తీసుకురాలేదని పేర్కొంటూ, పాఠశాల ప్రిన్సిపాల్, ఇతర సిబ్బందిపై సుమోటోగా ఫిర్యాదు నమోదు చేస్తామని కోసాంబే తెలిపారు.
గత నెలలోనే తాను ప్రిన్స్ పాల్ గా బాధ్యతలు స్వీకరించానని పాఠశాల ప్రిన్స్ పాల్ బసమ్మ వెల్లడించారు. బాలిక జనన ధృవీకరణ పత్రంలో ఆమె వయస్సు 17 సంవత్సరాల 8 నెలలు అని ఉందని.. విద్యార్థిని గర్భం గురించి ఎటువంటి లక్షణాలు తనకు కనిపించలేదని ఆమె చెప్పుకొచ్చారు. . జూన్‌లో స్కూల్ ప్రారంభమైనప్పటి నుండి ఆ బాలిక చాలా రోజులుగా పాఠశాలకు హాజరు కాలేదని పేర్కొంది. ఆమె ఆగస్టు 5 నుండి మాత్రమే స్కూల్‌కి వస్తుందని ప్రిన్పిపాల్ తెలిపారు.
