Site icon NTV Telugu

Karnataka vs Jharkhand: టార్గెట్ 413.. అయితే ఏం..! థ్రిల్లింగ్ విజయం అందుకున్న కర్ణాటక..

Karnataka Vs Jharkhand

Karnataka Vs Jharkhand

Karnataka vs Jharkhand: విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌లో పెను సంచనాలు నమోదవుతున్నాయి. గ్రూప్ A మ్యాచ్‌లో కర్ణాటక జట్టు ఝార్ఖండ్‌పై ఊహించని భారీ విజయాన్ని అందుకుంది. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ హై-స్కోరింగ్ థ్రిల్లర్‌లో 15 బంతులు మిగిలి ఉండగానే 413 పరుగుల భారీ లక్ష్యాన్ని కర్ణాటక 5 వికెట్ల తేడాతో ఛేదించింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 825 పరుగులు నమోదయ్యాయి.

Payal Rajput: శివాజీ వ్యాఖ్యలపై ‘పాయల్ రాజ్‌పుత్’ ఫైర్.. ఆ వ్యాఖ్యలు అసహనం తెప్పించాయంటూ..!

ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఝార్ఖండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 412 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ ఆకాశామే హద్దుగా సిక్సర్ల వర్షం కురిపించాడు. ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ లో కేవలం 39 బంతుల్లో 7 ఫోర్లు, 14 సిక్సర్లతో 125 ధనాధన్ సెంచరీతో ఝార్ఖండ్ ఇన్నింగ్స్‌ను భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లాడు. ఇక ఇషాన్ కిషన్ తోడుగా ఇన్నింగ్స్ లో విరాట్ సింగ్ (88), కుమార్ కుషాగ్ర (63), శిక్షర్ మోహన్ (44) సహకారంతో ఝార్ఖండ్ భారీ స్కోరును నమోదు చేసింది. కర్ణాటక బౌలర్లలో అభిలాష్ శెట్టి 4 వికెట్లు, విద్యాధర్ పాటిల్ 2 వికెట్లు తీశారు.

Delhi vs Andhra: సెంచరీతో కదం తొక్కిన విరాట్ కోహ్లీ.. ఆంధ్రపై ఢిల్లీ భారీ విజయం..!

413 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కర్ణాటకకు మంచి ఆరంభం లభిందింది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 34 బంతుల్లో 54 పరుగులతో మంచి ఆరంభాన్ని అందించాడు. ఇక దేవదత్ పడిక్కల్ 118 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్లతో 147 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మయాంక్‌తో కలిసి తొలి వికెట్‌కు 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత కరుణ్ నాయర్ (29), రవిచంద్రన్ స్మరణ్ (27), కృష్ణన్ శ్రీజిత్ (38) సహకారంతో కర్ణాటక లక్ష్యానికి దగ్గరయింది. పడిక్కల్ ఔటైన తర్వాత అభినవ్ మనోహర్ 56, ధ్రువ్ ప్రభాకర్ 40 పరుగుల అజేయ భాగస్వామ్యంతో జట్టును విజయతీరానికి చేర్చారు. 47.3 ఓవర్లలోనే కర్ణాటక 413 పరుగుల భారీ లక్ష్యాన్ని అధిగమించింది. ఝార్ఖండ్ బౌలర్లలో సౌరభ్ శేఖర్, ఉత్కర్ష్ సింగ్ 2 వికెట్లు తీశారు.

Exit mobile version