Site icon NTV Telugu

Karnataka : ఎన్నికల వేళ కర్ణాటకలో బీజేపీ నేత హత్య

Praveen

Praveen

Karnataka Elections: కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఎటు చూసిన అన్ని పార్టీలోనూ ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీకి చెందిన యువనేత దారుణ హత్యకు గురికావడం కలకలం సృష్టిస్తోంది. ధార్వాడ నియోజకవర్గానికి చెందిన యువ మోర్చా నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ధార్వాడలో ఆలయ ఉత్సవం సందర్భంగా మంగళవారం ప్రవీణ్, కొంతమంది తాగుబోతుల మధ్య గొడవ జరిగింది. ఉత్సవం ముగిసిన తర్వాత జాతరను బయటకు తీస్తుండగా.. మద్యం మత్తులో ఉన్న కొంతమంది ప్రవీణ్‌తో గొడవకు దిగారు. ప్రవీణ్‌ గట్టిగా వాదించడంతో మత్తులో ఉన్నవారు అక్కడ నుంచి వెళ్లిపోయారు. అయితే కొద్దిసేపటి తర్వాత మళ్లీ తిరిగొచ్చి ప్రవీణ్, అతడి సహచరులను దుర్భాషలాడారు. దీంతో ఇరు వర్గాల మధ్య మళ్లీ తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది.

Read Also: LSG vs RR: లక్నో చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓటమి.. అదే కొంపముంచింది

ఈ క్రమంలో ఓ వ్యక్తి ప్రవీణ్ కమ్మర్‌ను గట్టిగా కడుపులో కత్తితో పొడిచాడు. అనంతరం అక్కడ నుంచి పరార్ అయ్యాడు. ప్రవీణ్‌ను వెంటనే అతడి మద్దతుదారులు దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే ప్రవీణ్ మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ప్రవీణ్ మద్దతుదారుల ఫిర్యాదుతో గరగ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ముగ్గురిని ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రవీణ్ దారుణ హత్యపై బీజేపీ యువ మోర్బా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య స్పందించారు. ప్రవీణ్‌ను రాజకీయ కక్షలతోనే దారుణంగా హత్య చేశారని, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే నెల 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఇలాంటి తరుణంలో బీజేపీ నాయకుడి హత్య కలకలం రేపుతోంది.

Read Also: Aisha Sharma: ముందు వెనుకా.. దాచుకోకుండా చూపించేస్తోందే

దేశ రాజకీయాల్లో ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. అక్కడ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోండగా.. ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. మరోవైపు జేడీఎస్ కూడా తిరుగులేని శక్తిగా ఎదగాలని చూస్తుండటంతో.. కర్ణాటక పాలిటిక్స్ రక్తికట్టిస్తున్నాయి.

Exit mobile version