NTV Telugu Site icon

DK Shivakumar: డీకే శివకుమార్‌ బర్త్‌డే రోజే కొత్త సీఎం ప్రమాణం.. ఏ గిఫ్ట్‌ ఇస్తారే మరి..?

Dk Shivakumar 2

Dk Shivakumar 2

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకుంది కాంగ్రెస్‌ పార్టీ.. సర్వేలు, ఎగ్జిట్‌పోల్స్‌.. ఇలా ఎవరి అంచనాలకు దొరకకుండా గెలుపును తన ఖాతాలో వేసుకుంది కాంగ్రెస్‌ పార్టీ.. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది.. అయితే, కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరు? అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. మాజీ సీఎం, సీనియర్‌ నేత సిద్ధరామయ్య సీఎం అవుతారా? ట్రబుల్‌ షూటర్‌గా పేరుపొందిన పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌ సీఎం చైర్‌లో కూర్చోబోతున్నారా? అనేది ఆసక్తికరంగా మారింది.. అయితే, ఎల్లుండి కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.. అదే రోజు పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌ పుట్టిన రోజు కూడా ఉంది. దీంతో.. కాంగ్రెస్‌ అధిష్టానం డీకేకు ఏం గిఫ్ట్‌ ఇవ్వబోతుంది? అనేది ఆసక్తికరంగా మారింది.. సీఎం పదవి కట్టబెడుతుందా? పార్టీ బాధ్యతలే చూసుకోమంటుందా? అనేది ఉత్కంఠగా మారింది.

Read Also: DK Shivakumar: “సోనియా గాంధీ మాటిచ్చినట్లే”.. డీకే శివకుమార్ కన్నీరు..

కాగా, డీకే శివ కుమార్‌ కర్ణాటక శాసనసభకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.. మూడుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.. ప్రస్తుతం కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడిగా ఉన్నాడు. పార్టీలో వివిధ హోదాలతో పాటు.. ఎమ్మెల్యేగా, మంత్రిగా పలు శాఖల బాధ్యతలు చేపట్టి విజయవంతంగా నిర్వహించారు.. మరి. ఈ సారి సీఎం చైర్‌ ఎక్కుతారా? లేదా? అనేది వేచిచూడాలి.. మరోఎవైపు.. కర్నాటక ఎన్నికల ఫలితాలపై స్పందించిన డీకే శివకుమార్‌.. హర్షం వ్యక్తం చేశారు. తాను జైలులో ఉన్న సమయంలో.. సోనియా గాంధీ నన్ను జైలుకు వచ్చి అలా పరామర్శించడం మరిచిపోలేదని ఆయన భావోద్వేగానికి గురై, కంటతడి పెట్టుకున్నారు. కర్ణాటకను ఆదుకుంటానని సోనియా గాంధీకి మాటిచ్చినట్లు ఆయన తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి విజయం అందిస్తానని సోనియాగాంధీకి, రాహుల్ గాంధీకి, ప్రియాంకాగాంధీకి, మల్లికార్జన ఖర్గేకి తాను హామీ ఇచ్చానని, సోనియాగాంధీ నన్ను జైలులో పరామర్శించడం మరిచిపోలేదని భావోద్వేగానికి గురయ్యారు.. అయితే, ఈ రోజు సాయంత్రంలోగా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? అనేది తేల్చే విధంగా కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు చేస్తోంది.