Karnataka: కర్ణాటకలో ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి చుట్టుముట్టింది. టీవీ చానళ్లలో, సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయిన కొన్ని వీడియోల కారణంగా ప్రభుత్వం వెంటనే చర్యలకు దిగింది. ఆ వీడియోల్లో ఆ అధికారి అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తోందన్న ఆరోపణలతో ఆయనను డీజీపీ స్థాయి అధికారిని సస్పెండ్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెండ్ అయిన అధికారి కే. రామచంద్రరావు. ఆయన ప్రవర్తన ఒక ప్రభుత్వ ఉద్యోగికి తగిన విధంగా లేదని, ప్రభుత్వానికి పరువు నష్టం కలిగించిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విచారణ పూర్తయ్యే వరకు విధుల నుంచి తప్పిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
READ MORE: 200MP కెమెరా, 9,000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6తో OnePlus 16
అయితే ఈ ఆరోపణలను రామచంద్రరావు పూర్తిగా ఖండించారు. తనకు సంబంధం లేని వీడియోను కావాలనే సృష్టించారని అన్నారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని, ఆ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో తయారు చేసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. “నాకు షాక్‌గా ఉంది. ఇది అంతా అబద్ధం. ఆ వీడియో గురించి నాకు ఏమీ తెలియదు” అని చెప్పారు. ఎవరు, ఎందుకు ఇలా చేశారో తనకు అర్థం కావడం లేదని తెలిపారు. మరోవైపు.. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. విషయం పూర్తిగా విచారిస్తామని చెప్పారు. ఎంత పెద్ద అధికారి అయినా చట్టానికి అతీతుడు కాదని స్పష్టం చేశారు. “ఈ విషయం నాకు ఉదయమే తెలిసింది. తప్పు ఉంటే చర్యలు తప్పవు” అని సీఎం అన్నారు.
వీడియోలు బయటకు వచ్చిన వెంటనే ప్రభుత్వం రామచంద్రరావును సస్పెండ్ చేసింది. ఈలోగా ఆయన హోంమంత్రి జి. పరమేశ్వరును కలవడానికి ప్రయత్నించినా, ఆ భేటీ జరగలేదు. మంత్రి ఇంటి బయట మీడియాతో మాట్లాడిన రామచంద్రరావు మరోసారి ఆరోపణలను ఖండించారు. ఈ సస్పెన్షన్ వెనుక గతంలో జరిగిన మరో వివాదం గుర్తుకు వస్తోంది. గత ఏడాది ఆగస్టులోనే రామచంద్రరావును ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకుంది. అంతకు ముందు ఆయనను తప్పనిసరి సెలవులోకి పంపించారు. అప్పట్లో ఆయన స్టెప్‌డాటర్, నటి రణ్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టు కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
