NTV Telugu Site icon

Indira Canteen: ప్రయాణికులకు శుభవార్త.. రూ.10కే భోజనం, రూ. 5 లకు అల్ఫాహారం!

Indira Canteen Bangalore

Indira Canteen Bangalore

Karnataka Govt Plans Indira Canteens at Bangalore Airport: కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో లివింగ్ కాస్ట్ చాలా ఎక్కువ అన్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌తో పోలిస్తే దాదాపు డబుల్ రేట్స్ అక్కడ ఉంటాయి. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో కప్పు టీ లేదా కాఫీకి రూ. 200 నుంచి రూ. 500 ఉంటుంది. అదే భోజనం చేయడానికి రూ. 500-1,000 చెల్లించుకోవాల్సిందే. అధిక ధరలతో ఇబ్బందిపడుతున్న ప్రయాణికులకు ఓ శుభవార్త. బెంగుళూరు విమానాశ్రయంలో కేవలం 10 రూపాయలకే భోజనం అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ‘ఇందిరా క్యాంటీన్’ను విమానాశ్రయంలో ప్రారంభించాలని కర్ణాటక కేబినెట్ సమావేశం నిర్ణయించింది.

బెంగళూరులో ఇప్పటికే 175కి పైగా ఇందిరా క్యాంటీన్‌లు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ఇందిరా క్యాంటీన్‌లలో కేవలం రూ. 5కే అల్ఫాహారం, రూ. 10కే మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో ఇందిరా క్యాంటీన్‌లకు నాణ్యమైన ఆహారం అందడం లేదని.. వాటిని మూసేయాలని ఆలోచన చేశారు. అయితే ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. సీఎం సిద్ధరామయ్య ఇందిరా క్యాంటీన్‌లోని లంచ్, స్నాక్స్ మెనూను మార్చారు. రాగి ముద్ద, మంగళూరు బన్స్‌తో సహా పలు రకాల భోజనాలు వడ్డిస్తున్నారు.

Also Read: Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. తులం ఎంతకు చేరిందో తెలుసా?

ఖరీదైన ఫుడ్ అవుట్‌లెట్లలో కూడా ఇందిరా క్యాంటీన్ భోజనం ప్రారంభించాలని కర్ణాటక ప్రభుత్వం యోచిస్తోంది. సామాన్యులు, మధ్యతరగతి, వ్యాపారులు, విలాసవంతమైన వ్యక్తులకు గమ్యస్థానంగా ఉన్న బెంగళూరులోని నాడప్రభు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇందిరా క్యాంటీన్ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అల్పాహారం రూ. 5, మధ్యాహ్న భోజనం రూ.10కే అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బెంగళూరు విమానాశ్రయంలో ఇందిరా క్యాంటీన్‌ను త్వరలోనే ప్రారంభం కానుంది. విమానాశ్రయంలోని పార్కింగ్ ప్రాంతంలో 2 ఇందిరా క్యాంటీన్‌లను ప్రారంభించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.

Show comments