Site icon NTV Telugu

Karnataka: కర్ణాటకలోనూ తమిళనాడు సీనే రిపీట్.. అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్

Karnataka

Karnataka

దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గవర్నర్లు వాకౌట్ అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు. మొన్నటికి మొన్న తమిళనాడు గవర్నర్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం కేరళలో కూడా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కూడా ప్రసంగంలోని కొన్ని భాగాలను విస్మరించారని.. తాను సూచించిన మార్పులు ముసాయిదాలో చేర్చలేదంటూ సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు ఇదే కోవలో కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ కూడా చేరారు. ఈ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాలే ఉన్నాయి. తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం.. కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం.. కేరళలో పినరయి విజయన్ ప్రభుత్వాలు ఉన్నాయి. కేవలం దక్షిణ భారత్ రాష్ట్రాల్లోనే ఇలా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

తాజాగా కర్ణాటక అసెంబ్లీలో థావర్‌చంద్ గెహ్లాట్ బడ్జెట్ ప్రసంగం చేస్తూ… కొన్ని భాగాలను చదివేందుకు నిరాకరించారు. అంతలోనే అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. ఉపాధి హామీ బిల్లుకు సంబంధించిన సూచనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాకౌట్ చేసి వెళ్లిపోయారు. దీంతో సిద్ధరామయ్య సర్కార్-రాజ్‌భవన్ మధ్య ఘర్షణ వాతావరణంగా మారింది.

ఇది కూడా చదవండి: Gold-Silver Rates: శాంతించిన బంగారం, వెండి ధరలు.. కలిసొచ్చిన ఈయూ ప్రకటన

 

Exit mobile version